Trending Video: ఏం గుండె ధైర్యం సామీ నీది.. అసలు అక్కడి దాకా ఎలా వెళ్లావ్.. వీడియో చూస్తే వణికిపోవాల్సిందే..
అగ్నిపర్వతాలు ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన వాటిలో ఒకటి. ఇవి క్షణాల్లో అతిపెద్ద నగరాన్ని కూడా నాశనం చేయగల శక్తిని కలిగి ఉంటాయి. అగ్నిపర్వత విస్ఫోటనం తర్వాత.. పరిసర ప్రాంతాల్లో వినాశనం...

అగ్నిపర్వతాలు ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన వాటిలో ఒకటి. ఇవి క్షణాల్లో అతిపెద్ద నగరాన్ని కూడా నాశనం చేయగల శక్తిని కలిగి ఉంటాయి. అగ్నిపర్వత విస్ఫోటనం తర్వాత.. పరిసర ప్రాంతాల్లో వినాశనం ఎలా ఉంటుందో మనం చూశాం. అగ్నిపర్వతం లావా చాలా వేడిగా ఉంటుంది. అది ఎముకలను కూడా క్షణాల్లో కరిగిస్తుంది. అందుకే మరిగే లావా దగ్గరికి వెళ్లడానికి ఎవరు ధైర్యం చేయరు. కానీ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ వీడియోలో.. ఒక వ్యక్తి ఎటువంటి భద్రత చర్యలు తీసుకోకుండా మండుతున్న అగ్నిపర్వతం లావా దగ్గరికి వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచాడు. మరుగుతున్న లావా ఉష్ణోగ్రత సుమారు 1000 డిగ్రీల సెల్సియస్. అటువంటి పరిస్థితిలో ఆ వ్యక్తి దాని దగ్గరకు ఎలా వెళ్లాడు. అతను మరుగుతున్న లావా వేడిని అనుభవించలేదా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
గగుర్పాటు కలిగించే దృశ్యం నిజమా కాదా అనే దానిపై ఎలాంటి సమాచారం లేదు. ఈ దృశ్యాన్ని చూసిన కొందరు ఈ ప్రదేశం నరకానికి ద్వారం అని పిలిస్తే.. మరి కొందరు మాత్రం ఇది లావాతో నిండిన సముద్రంలా కనిపిస్తుందని అంటున్నారు. అక్కకడికి వెళ్లడానికి ఎవరూ సాహసించరు అని కామెంట్లు చేస్తున్నారు. ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియో.. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది.




What it looks like at the edge of a lava ocean ? pic.twitter.com/XeMhIrLolx
— OddIy Terrifying (@OTerrifying) December 24, 2022
కేవలం 21 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియోకు ఇప్పటి వరకు 2 మిలియన్లకు పైగా వ్యూస్, 51 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. వీడియో చూసిన తర్వాత నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్లు రూపంలో రాస్తున్నారు. ‘లావా సముద్రానికి ఇంత దగ్గరగా నిలబడటానికి నేను ఎన్నటికీ ఇష్టపడను’ అని కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..