AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Work From Home: ఉద్యోగిని విధుల నుంచి తొలగించిన కంపెనీ.. అవాక్కయ్యే ట్విస్ట్ ఇచ్చిన ఎంప్లాయ్.. అసలేం జరిగిందంటే..

కరోనా వైరస్ వ్యాప్తి చెందినప్పటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ కు ప్రాధాన్యత ఏర్పడింది. లాక్ డౌన్ కారణంగా పలు సంస్థలు ఉద్యోగులు ఇంటి నుంచి పని చేసే విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చాయి. ప్రస్తుతం..

Work From Home: ఉద్యోగిని విధుల నుంచి తొలగించిన కంపెనీ.. అవాక్కయ్యే ట్విస్ట్ ఇచ్చిన ఎంప్లాయ్.. అసలేం జరిగిందంటే..
Work from home
Ganesh Mudavath
|

Updated on: Oct 16, 2022 | 7:21 AM

Share

కరోనా వైరస్ వ్యాప్తి చెందినప్పటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ కు ప్రాధాన్యత ఏర్పడింది. లాక్ డౌన్ కారణంగా పలు సంస్థలు ఉద్యోగులు ఇంటి నుంచి పని చేసే విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చాలా కంపెనీలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయి. అయితే ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గడం, పరిస్థితులు చక్కబడడంతో కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీస్ లకు రప్పిస్తున్నాయి. ఇక్కడి వరకు బాగుంది గానీ కొన్ని కంపెనీలు మాత్రం తమ ఉద్యోగులపై వింత రూల్స్‌ పెడుతున్నాయి. వాటిని పాటించాల్సిందేనని కరాఖండీగా చెప్పేస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికాకు చెందిన ఓ కంపెనీ విచిత్రమైన కారణంతో తన ఉద్యోగిని విధుల నుంచి తొలగించింది. కంపెనీ వ్యవహరించిన విధానంపై ఆ ఉద్యోగి కోర్టును ఆశ్రయించాడు. దీంతో అతనికి న్యాయంతో పాటు పరిహారం కూడా దక్కింది. ఫ్లోరిడాకు చెందిన ఓ టెలీ మార్కెటింగ్ కంపెనీ తమ సంస్థకు చెందిన ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఆప్షన్ కల్పించింది.

కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం ఇచ్చినట్లే ఇచ్చి.. ఇందులో ఓ మెలిక కూడా పెట్టింది. ఉద్యోగులు రోజుకు తొమ్మిది గంటల పాటు కెమెరాను ఆన్‌లో ఉంచాలని, దీంతో పాటు వారి ల్యాప్‌టాప్ స్క్రీన్‌ను షేర్‌ చేయాలని తెలిపింది. అయితే కంపెనీ పెట్టిన ఈ షరతుకు ఓ ఉద్యోగి అంగీకరించలేదు. ఇది తన ప్రైవసీకి ఇబ్బందిగా ఉందని భావించి రూల్స్‌ను పక్కన పెట్టాడు. ఉద్యోగి ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన సదరు కంపెనీ అతడిని విధుల నుంచి తొలగించింది. కంపెనీ తనను అకారణంగా ఉద్యోగం తొలగించిందన్న కారణంతో అతను కోర్టుకు వెళ్లాడు.

ఇవి కూడా చదవండి

అతని పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు.. కంపెనీ ఆదేశాలు సక్రమంగా లేవని, ఉద్యోగిని విధుల నుంచి తొలగించడానికి సరైన కారణాలు లేవని తెలిపింది. అంతే కాకుండా ఆ ఉద్యోగికి 72,700 అమెరికన్‌ డాలర్లు (సుమారు రూ. 60 లక్షలు) చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది.