Viral Video: ప్రకృతి ప్రకోపిస్తే ఇంత భయంకరంగా ఉంటుందా.? కిలో మీటర్ల మేర కుప్పకూలిన ఫ్లై ఓవర్..
Viral Video: ప్రకృతి చూడడానికి ఎంత ప్రశాంతంగా ఉంటుందో ప్రకోపిస్తే అంత వయలెంట్‌గా ఉంటుంది. సునామీ, భూకంపం, భారీ వర్షాలు.. ఇవన్నీ ప్రకృతి సృష్టించే వినాశనం తాలుకూ సాక్ష్యాలు. తాజాగా తైవాన్ దేశంలో ఇలాంటి...
Viral Video: ప్రకృతి చూడడానికి ఎంత ప్రశాంతంగా ఉంటుందో ప్రకోపిస్తే అంత వయలెంట్‌గా ఉంటుంది. సునామీ, భూకంపం, భారీ వర్షాలు.. ఇవన్నీ ప్రకృతి సృష్టించే వినాశనం తాలుకూ సాక్ష్యాలు. తాజాగా తైవాన్ దేశంలో ఇలాంటి భయానక దృశ్యాలే కనిపిస్తున్నాయి. శనివారం నుంచి ఆ దేశంలో సంభవిస్తున్న వరుస భూకంపాల కారణంగా అతలాకుతలమవుతోంది. శనివారం సాయంత్రం సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదైంది. ఆదివారం మరోసారి 6.9 తీవ్రతతో భూమి కంపించింది. భూకంపం తీవ్రతకు భవనాలు పేక మేడళ్లా కూలిపోతున్నాయి, రైళ్లు బొమ్మలా ఊగిపోతున్నాయి.
తాజాగా ఈ సంఘటనలకు సంబంధించిన ఒక్కో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా భూకంపం ధాటికి ఓ ఫ్లైఓవర్ ధ్వంసనమైన తీరు అందరినీ భయానికి గురి చేస్తోంది. ఆదివారం సంభవించిన భూకంపం కారణంగా సౌత్‌ఈస్ట్రర్న్ ప్రాంతంలో ఉన్న ఓ ఫ్లై ఓవర్ పూర్తిగా ధ్వసంమైంది. కిలో మీటర్ల మేర కుప్పకూలిపోయింది. రూ. వేల కోట్ల వ్యయంతో, ఏళ్ల సమయం నిర్మించిన ఫ్లైఓవర్ క్షణాల్లో కుప్పకూలిపోయింది. రంగంలోకి దిగిన అధికారులు నష్టంపై అంచనా వేసే పనిలో ఉన్నారు. ఇదిలా ఉంటే తైవాన్‌లో భూకంపం దాటికి పాఠశాలలు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి.
తైవాన్‌లో సంభవించిన భూకంపాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే 12 వేల మందిని ప్రత్యేక కేంద్రాలకు తరలించారు. ఇక భూకంపం వల్ల రహదారులు మూసుకు పోయి 600 మంది చిక్కుకుపోయారు. తూర్పు తైవాన్‌లోని డోంగ్లీ స్టేషన్‌లో ప్లాట్‌ఫారమ్ పై కొంత భాగం కూలిపోవడంతో ఆరు బోగీలు పట్టాలు తప్పాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..