AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నడి సముద్రంలో నౌక.. చుట్టుముట్టిన సుడిగుండాలు.. ఆకాశం నుంచి అందిన సాయం.. సిబ్బందిని కాపాడిన తీరు చూస్తే షాకే

Cargo ship: సముద్రం మధ్యలో ఓ భారీ నౌకలో పయానిస్తున్నామంటే సంతోషం కన్నా.. భయమే ఎక్కువగా ఉంటుంది. సముద్రంలోని అలల శభ్దానికి గుండెలు ఆగిపోయినట్టుగా అనిపిస్తుంది.

నడి సముద్రంలో నౌక.. చుట్టుముట్టిన సుడిగుండాలు.. ఆకాశం నుంచి అందిన సాయం.. సిబ్బందిని కాపాడిన తీరు చూస్తే షాకే
Duch Cargo Ship
Rajitha Chanti
|

Updated on: Apr 08, 2021 | 6:21 PM

Share

Cargo ship:  సముద్రం మధ్యలో ఓ భారీ నౌకలో పయానిస్తున్నామంటే సంతోషం కన్నా.. భయమే ఎక్కువగా ఉంటుంది. సముద్రంలోని అలల శభ్దానికి గుండెలు ఆగిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇక అసలు భూభాగమే కనిపించకుండా.. చుట్టూ నీరు.. ఆ మధ్యలో నౌక.. సరిగ్గా అప్పుడే అనుకోని ప్రమాదం ఎదురవుతే ఎలా ఉంటుంది. ఆలోచించడానికే భయంగా ఉంది కదూ. కానీ అలాంటి సమయంలో అపద్బాంధువులుగా ఎవరైన వచ్చి మిమ్మల్ని రక్షిస్తే.. అది కూడా ఆకాశ మార్గన హెలికాఫ్టర్‏ ద్వారా వచ్చి మీకు హెలికాఫ్టర్‏కు మధ్య వారధిగా కేవలం ఒక తాడు మాత్రమే.. ఎంటీ ఇది హాలీవుడ్ సినిమా స్టోరీ అనిపిస్తుంది కదూ. కానీ ఇది నిజంగా జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

డచ్ కార్గో షిప్ మంగళవారం నార్వేజియన్ సముద్రంలో వాతవరణ మార్పులతో అటుపోట్లకు గురవుతుంది. దీంతో అందులోని సిబ్బంది మొత్తాన్ని విమానంలో రక్షించారు. ఈ సమయంలో కొంతమందిని సముద్రంలోకి దూకిన తర్వాత కాపాడారు. వివరాల్లోకెళితే.. జర్మనిలోని బ్రెమెర్ హావెన్ నుంచి నార్వేలోని కొల్వరైడ్ వరకు కొన్ని కొన్ని చిన్న నౌకలను తీసుకువెళ్తున్న డచ్ కార్గో షిప్ ఈమ్ల్సిఫ్ట్ హెండ్రికా సోమవారం సముద్రంలో ప్రయాణిస్తుండగా.. వాతావరణం అనుకూలించకపోవడంతో అటు పోట్లకు గురవుతుంది. దీంతో ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన షిప్ సిబ్బంది ఈ విషయాన్ని అక్కడి యాజమాన్యానికి అందించింది. వారు వెంటనే సహాయక సిబ్బందిని పంపిస్తారు. వారు హెలికాఫ్టర్ ద్వారా రంగంలో దిగి షిప్‏లో ఉన్న 12 మందిని కాపాడారు.

ముందుగా సహాయక సిబ్బంది షిప్ డెక్ మీద ఉన్న వారిని కాపాడటం కోసం మొదటిగా హెలికాప్టర్‏లో ఉన్న సహాయక సిబ్బంది ఒకరు ఇనుప తాడు సాయంతో షిప్ డెక్ మీదకు దిగాడు. ఆ తర్వాత అతడు ఒక్కొక్కరిని అదే తాడు ద్వారా హెలికాప్టర్‏లోకి పంపించాడు. ఇలా 8 మందిని కాపాడిన తర్వాత షిప్ మరింత అటుపోట్లకు గురవుతూ.. ప్రమాదకర రీతిలో కదలుతుంది. దీంతో డెక్ మీద మిగిలి నలుగురిని సముద్రంలోకి దూకమని చెప్పి.. ఆ తర్వాత వారిని కూడా రక్షించారు. అయితే ఈ రెస్య్కూ ఆపరేషన్ జరిగిన తీరు చూస్తుంటే మాత్రం రొమాలు నిక్కబొడుచుకుంటాయి. ఈ వీడియో చూస్తుంటే ఒకింత భయం కలగమానదు. మరీ ఆ వీడియోను మీరు ఓసారి చూసెయ్యండి..

వీడియో..

Also Read: కొత్త సినిమాను ప్రారంభించిన అక్కినేని అఖిల్.. ‘ఏజెంట్’ పూజా కార్యక్రమాలకు హజరైన నాగార్జున, అమల..