- Telugu News Photo Gallery Cinema photos Akkineni akhil new movie agent first look and pooja photos goes viral in social media
కొత్త సినిమాను ప్రారంభించిన అక్కినేని అఖిల్.. ‘ఏజెంట్’ పూజా కార్యక్రమాలకు హజరైన నాగార్జున, అమల..
అక్కినేని అఖిల్ నాగార్జున, అమల వారసుడిగా మొదటి సినిమా తన పేరుతోనే హీరోగా ఎంట్రీగా ఇచ్చాడు. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అవి అంతగా హిట్ అవ్వలేదు. అయితే సరైన హిట్టు కొట్టేందుకు ఈసారి డిఫరెంట్ లుక్కులో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు
Updated on: Apr 08, 2021 | 5:32 PM

ఏప్రిల్ 8న 27వ పుట్టిన రోజును జరుపుకుంటున్న అఖిల్.. ఈ సందర్భంగా ఆయన కొత్త సినిమా 'ఏజెంట్' మూవీని పూజా కార్యక్రమాలతో ప్రారంభించాడు. ఈ కార్యక్రమానికి నాగార్జున, అమల ముఖ్యఅతిధులుగా పాల్గొన్నారు.

ఈ సినిమాను ఏ.కె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సురేందర్ సినిమా సంయుక్త సమర్పణలో అనిల్ సుంకర నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవితో కలిసి 'సైరా నరసింహ రెడ్డి' సినిమాను తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్న సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.


మునుపెన్నడూ చూడని విభిన్నమైన కథ, యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. ఇందులో అఖిల్ సీక్రెట్ ఏజెంట్గా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.

ఫస్ట్ లుక్తోపాటే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్రయూనిట్. ఈ మూవీని డిసెంబర్ 24న విడుదల చేయనున్నట్లుగా తెలిపింది.

ప్రస్తుతం అఖిల్.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాను చేస్తున్నాడు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా.. జూన్ 19న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

అక్కినేని అఖిల్..




