Peshawar: పెషావర్ ఆత్మాహుతి దాడిలో పెరుగుతున్న పెరుగుతున్న మృతులు.. ఇప్పటి వరకు 93 మృతదేహాలు గుర్తింపు..

పాకిస్తాన్ లోని పెషావర్ లో జరిగిన ఆత్మాహుతి దాడి ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకూ 93 మంది మృతి చెందగా మరో 200 మందికి పైగా గాయపడ్డారు. సహాయక చర్యలు చేపడుతున్న సిబ్బంది..

Peshawar: పెషావర్ ఆత్మాహుతి దాడిలో పెరుగుతున్న పెరుగుతున్న మృతులు.. ఇప్పటి వరకు 93 మృతదేహాలు గుర్తింపు..
Blast In Peshawar
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jan 31, 2023 | 3:20 PM

పాకిస్తాన్ లోని పెషావర్ లో జరిగిన ఆత్మాహుతి దాడి ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకూ 93 మంది మృతి చెందగా మరో 200 మందికి పైగా గాయపడ్డారు. సహాయక చర్యలు చేపడుతున్న సిబ్బంది.. శిథిలాల నుంచి ఇంకా మృతదేహాలను వెలికి తీస్తూనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. పెషావర్‌లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే పోలీస్‌ లైన్స్‌లోని ఓ మసీదులో సోమవారం మధ్యాహ్నం ఆత్మాహుతి దాడి జరిగింది. ఇప్పటికే 93 మంది చనిపోగా.. ఇంకా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని డాక్టర్లు, అధికారులు చెబుతుండటం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందకి. దాదాపు 20 మంది పోలీసు అధికారులు, భద్రతా సిబ్బంది ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.

కాగా.. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రముఠా నుంచి కూడా ప్రకటన వెలువడలేదు. పాకిస్తాన్ పరిరక్షణ కోసం పాటుపడుతోన్న వారిని లక్ష్యంగా చేసుకొని, ఉగ్రవాదులు భయాన్ని సృష్టించాలని అనుకుంటున్నారని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాక్ కు.. ఇప్పుడు జరిగిన ఆత్మాహుతి దాడి ఘటన కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఆ దేశంలో పరిస్థితిని మరింత దిగజార్చింది.

సోమవారం మధ్యాహ్నం 1.40 గంటలకు మసీదులో భద్రతా సిబ్బంది సహా మరికొందరు ప్రార్థనలు చేస్తున్న సమయంలో.. ముందు వరుసలో ఉన్న గుర్తు తెలియని వ్యక్తి తనను తాను పేల్చుకున్నాడు. పేలుడు ధాటికి మసీదులోని కొంత భాగం కూలిపోయింది. శిథిలాల కింద ప్రజలు చిక్కుకున్నారు. అఫ్గానిస్థాన్‌లో గతేడాది ఆగస్టులో తమ కమాండర్‌ ఉమర్‌ ఖలీద్‌ ఖురసానిని చంపినందుకు ప్రతీకారంగా ఈ దాడి చేసినట్లు టీటీపీ ప్రకటించింది. 2007లో ఏర్పాటైన టీటీపీ కొన్నేళ్లుగా పాక్‌ భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..