నూతన సంవత్సర వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉంగాండలోని ఓ షాపింగ్‌మాల్‌లో ఆదివారం (జనవరి 1) జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది మృతి చెందారు. స్థానిక మీడియ కథనాల ప్రకారం.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో భాగంగా కంపాలలోని ఫ్రీడమ్ సిటీ మాల్‌లో పెద్ద సంఖ్యలో జనాలు పోగయ్యారు. అనంతరం అర్ధరాత్రి బాణాసంచా సెలబ్రేషన్స్ వీక్షించేందుకు బయటకు రావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. నలుగురు ఆసుపత్రిలో చిక్సిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు. అనేక మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన విషయాలు ఉగాండా పోలీస్ ఫోర్స్ అధికారులు ట్విటర్ ద్వారా తెలియజేశారు.
‘ఫ్రీడమ్ సిటీ మాల్‌లో చోటుచేసుకున్న నూతన సంవత్సర వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. ఎమర్జెన్సీ రెస్పాండర్స్ సంఘటనా స్థలానికి చోటు చేసుకుని సహాయక చర్యలు చేపట్టింది. తొక్కిసలాటలో తొమ్మిది మంది మృతిచెందారు. అనేకమంది గాయపడగా.. వారందరినీ సహాయక సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టినట్లు ట్వీట్‌లో తెలిపారు.
. @Lukowoyesigyire “The Katwe Territorial Police are investigating an incident of rash and neglect that occurred at a New Year’s Eve event at the Freedom City Mall Namasuba and resulted in the deaths of nine people, including several juveniles”
1/3— Uganda Police Force (@PoliceUg) January 1, 2023
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.