ఘోర ప్రమాదం.. 85మందితో వెళ్తున్న పడవ నదిలో మునిగి.. 76 మంది జలసమాధి.. ఎక్కడంటే..
ప్రమాద సమయంలో పడవలో 85 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. గల్లంతైన వారికోసం గాలిస్తున్నామన్నారు. ఇప్పటివరకు 76 మృతదేహాలను వెలికితీశామని వెల్లడించారు.
ఇదో విషాదకర సంఘటన. హృదయవిదారకం. ఒక్కేఒక్క ఘటనతో ఏకంగా 76మంది ప్రజలు సజీవ జల సమాధి అయిన సంఘటన అందరినీ కలిచి వేస్తుంది. వరదల కారణంగా 85 మంది ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది. ప్రమాదంలో76 మంది మరణించినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. నైజీరియా దేశంలో జరిగింది ఈ ఘోర పడవ ప్రమాదం. నైగర్ నదికి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో బగ్‌బారూ ప్రాంతంలో పడవ మునిగిపోయింది. దీంతో 76 మంది మరణించారు. మరికొందరు గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో పడవలో 85 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. గల్లంతైన వారికోసం గాలిస్తున్నామన్నారు. ఇప్పటివరకు 76 మృతదేహాలను వెలికితీశామని వెల్లడించారు.
పడవ ప్రమాదంపై నైజీరియా అధ్యక్షుడు ముహమ్మదు బుహారీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పడవలోని ప్రతిఒక్కరి ఆచూకీ లభించేవరకు సహాయక చర్యలు కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. మని చెప్పారు. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..