AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brazil Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. 61 మంది దుర్మరణం.. భయానక వీడియో

బ్రెజిల్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది.. ఆగస్టు 9న శుక్రవారం సావో పాలోలోని విన్‌హెడోలో జరిగిన విమాన ప్రమాదంలో అందులో ఉన్న మొత్తం 61 మంది మరణించారు. ప్రాంతీయ క్యారియర్ వోపాస్ కు చెందిన ఈ విమానం స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో జరిగింది.

Brazil Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. 61 మంది దుర్మరణం.. భయానక వీడియో
Plane Crash
Shaik Madar Saheb
|

Updated on: Aug 10, 2024 | 12:59 PM

Share

బ్రెజిల్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది.. ఆగస్టు 9న శుక్రవారం సావో పాలోలోని విన్‌హెడోలో జరిగిన విమాన ప్రమాదంలో అందులో ఉన్న మొత్తం 61 మంది మరణించారు. ప్రాంతీయ క్యారియర్ వోపాస్ కు చెందిన ఈ విమానం స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో జరిగింది.. పరానాలోని కాస్కావెల్ నుంచి సావో పాలో గౌరుల్హోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తుండగా.. విన్హెడో నగరంలోని నివాస ప్రాంతంలో విమానం కుప్పకూలింది.. దీంతో విమానంలో ఉన్న 61 మంది దుర్మరణం చెందారు. విమానంలో 57 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు విమానం నివాస ప్రాంతంలో కుప్పకూలడంతో భారీగా మంటలు ఎగసి పడ్డాయి.. అయితే., అదృష్టవశాత్తూ, స్థానిక నివాసితులు ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. విమాన ప్రమాదంలో ఒక ఇల్లు దెబ్బ తిన్నదని.. ఈ ఘటనకు గల కారణాలను అన్వేషిస్తున్నామని బ్రెజిల్ అధికారులు వెల్లడించారు.

సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను ఆర్పి రెస్య్క్యూ ఆపరేషన్ చేపట్టారు. బ్రెజిల్ సెంటర్ ఫర్ ఇన్వెస్టిగేషన్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్స్ ఎయిర్ బ్రిగేడియర్ మార్సెలో మోరెనో మాట్లాడుతూ.. కారణాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రమాదాన్ని నియంత్రించడానికి విమానం ఎటువంటి ఎమర్జెన్సీని కమ్యూనికేట్ చేయలేదని.. ఇప్పటివరకు, అత్యవసర పరిస్థితికి సంబంధించిన సూచనలు లేవని తెలిపారు.

వీడియో చూడండి..

ఇదిలాఉంటే.. విమానం క్రాష్ కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. విమానం కుప్పకూలే ముందు ఒకరు వీడియో తీయగా.. అది నెట్టింట వైరల్ అవుతోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..