బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనారిటీ వర్గాలపై జరుగుతున్న హింసపై ఆర్‌ఎస్‌ఎస్ ఆందోళన

భగ్గుమంటున్న బంగ్లాదేశ్‌.. సైనికుల చేతుల్లోకి వెళ్లిపోయింది. రిజర్వేషన్ల విషయంలో బంగ్లాదేశ్‌ భగ్గుమంది. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున హింస చెలరేగడంతో... వందలాది మంది పౌరులు చనిపోయారు. ప్రధాని హసీనా నివాసంలోకి చొరబడి మరీ ఆందోళనలు చేపట్టారు.

బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనారిటీ వర్గాలపై జరుగుతున్న హింసపై ఆర్‌ఎస్‌ఎస్ ఆందోళన
Dattatreya Hosabale
Follow us

|

Updated on: Aug 09, 2024 | 7:49 PM

భగ్గుమంటున్న బంగ్లాదేశ్‌.. సైనికుల చేతుల్లోకి వెళ్లిపోయింది. రిజర్వేషన్ల విషయంలో బంగ్లాదేశ్‌ భగ్గుమంది. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున హింస చెలరేగడంతో… వందలాది మంది పౌరులు చనిపోయారు. ప్రధాని హసీనా నివాసంలోకి చొరబడి మరీ ఆందోళనలు చేపట్టారు. ఆర్మీ హెచ్చరికలతో రాజీనామా చేసి దేశాన్ని విడిచి వెళ్లారు హసీనా. మరోవైపు బంగ్లాదేశ్‌లో హింసాత్మక పరిణామాలతో బంగ్లా-భారత్‌ సరిహద్దుల్లో హై అలర్ట్‌ విధించారు.

బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీ వర్గాలపై జరుగుతున్న హింసపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ఆందోళన వ్యక్తం చేసింది. వారి భద్రతకు భరోసా ఇవ్వడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నించాలని కోరింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు చెందిన సర్కార్యవా దత్తాత్రేయ హోసబాలే బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం హింసాత్మక సంఘటనలను అరికట్టడానికి తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితుల ప్రాణాలు, ఆస్తులు, గౌరవాన్ని రక్షించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.

బంగ్లాదేశ్‌లో హింసాత్మక విద్యార్థి ఉద్యమం తరువాత, ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆమె ప్రస్తుతం భారతదేశంలో ఆశ్రయం పొందుతున్నారు. అటు బంగ్లాదేశ్‌లో జరిగిన హింసలో అనేక హిందూ దేవాలయాలు, ఇళ్లు, వ్యాపారాలు ధ్వంసమయ్యాయి. హింసాకాండ మధ్య, షేక్ హసీనా స్థానంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు.

గత కొద్ది రోజులుగా బంగ్లాదేశ్‌లో అధికార మార్పిడి కోసం జరుగుతున్న ఉద్యమంలో హిందూ, బౌద్ధ, ఇతర మైనారిటీ వర్గాలపై జరుగుతున్న హింసాత్మక ఘటనలపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు హోసబలే విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీ వర్గాలను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేయడం, దోపిడీలు, దహనం, మహిళలపై క్రూరమైన నేరాలు, దేవాలయాల వంటి ప్రార్థనా స్థలాలపై దాడులు చేయడం సహించరానిదని, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ దీనిని తీవ్రంగా ఖండిస్తున్నదని హోసబలే అన్నారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఇలాంటి సంఘటనలను తక్షణమే కఠినంగా ఆపాలని ఆయన కోరారు. బాధితుల ప్రాణం, ఆస్తులు, గౌరవాన్ని రక్షించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నట్లు ఆయన తన ప్రకటనలో తెలిపారు.

బంగ్లాదేశ్‌లో హింసకు గురైన హిందూ, బౌద్ధ తదితర వర్గాలతో పాటు ప్రపంచ సమాజం, భారతదేశంలోని అన్ని రాజకీయ పార్టీలు కూడా ఐక్యంగా నిలబడాలని ఆయన అభ్యర్థించారు. బంగ్లాదేశ్‌లోని హిందువులు, బౌద్ధులు, ఇతర మైనార్టీ ప్రజల భద్రతకు భరోసా ఇవ్వడానికి ముందుకు రావాలన్నారు. పొరుగు స్నేహపూర్వక దేశంగా విలువైన పాత్ర పోషించడానికి ప్రయత్నిస్తున్న భారత ప్రభుత్వానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అండగా ఉంటామని ఆయన చెప్పారు.

రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో జరుగుతున్న హింసలో హిందువుల దాడులు, ఆలయాలపై దాడులకు వ్యతిరేకంగా భారత్‌లో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. కశ్మీర్‌లో, యూపీలో చాలా మంది హింసను ఖండిస్తూ ర్యాలీలు నిర్వహించారు.

బంగ్లాదేశ్‌కు హింస కొత్తకాదు. ఇక్కడ చాలా ప్రభుత్వాల మార్పులో హింస ప్రధాన పాత్ర పోషించిందన్నది వాస్తవం. సైన్యం చేతిలోకి బంగ్లాదేశ్‌ జారిపోతున్న 2009ను కాపాడింది హసీనాననే. కాని ఇప్పుడు ఆమె దేశవ్యాప్తంగా చెలరేగిన హింసాత్మక నిరసనలతో పదవీచ్యుతురాలు కావాల్సి వచ్చింది. మళ్లీ సైన్యం చేతిలోకి బంగ్లాదేశ్‌ వెళ్లిన పరిస్థితి. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు భారత్‌కు ఇబ్బంది కలిగించేవే. భారత్‌కు ఇంతకాలం అత్యంత మిత్రురాలిగా షేక్‌ హసీనా ఉన్నారు. రెండు దేశాల మధ్య రక్షణ, ఆర్థిక, సంస్కృతి బంధాల బలోపేతంలో కీలక భూమిక పోషించారు.

కయ్యానికి కాలు దువ్వే చైనా ఒకవైపు, దాయాది పాక్‌ను మరో వైపు ఎదుర్కొంటున్న భారత్‌ ఇప్పుడు తూర్పు సరిహద్దుల్లో బంగ్లాదేశ్‌లోని ఒడిదుడుకులను కూడా ఎదుర్కొనాల్సిన పరిస్థితి. భారతదేశానికి 25వ అతిపెద్ద వ్యాపార భాగస్వామి బంగ్లాదేశ్‌. గడిచిన రెండు దశాబ్దాలుగా భారత్‌ అక్కడ భారీ పెట్టుబడులు పెట్టింది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ప్రస్తుతం 12.9 బిలియన్‌ డాలర్లుగా ఉంది. బంగ్లాదేశ్‌లోని మోంగ్లా ఓడ రేవు నిర్వహణ బాధ్యతలు ఈ మధ్యే భారత్‌ దక్కించుకుంది. తాజా పరిణామాలతో ఆ ఒప్పందం డోలాయామానంలో పడినట్టే..!

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

టాటా నుంచి మరో సూపర్ ఈవీ కారు..ప్రత్యేకతలు, ధర వివరాలు ఏంటంటే?
టాటా నుంచి మరో సూపర్ ఈవీ కారు..ప్రత్యేకతలు, ధర వివరాలు ఏంటంటే?
బంగ్లాదేశ్‌ బాధితులకు అండగా నిలుద్దాంః ఆర్‌ఎస్‌ఎస్
బంగ్లాదేశ్‌ బాధితులకు అండగా నిలుద్దాంః ఆర్‌ఎస్‌ఎస్
ఈ కానిస్టేబుల్‌కి సెల్యూట్.. యాక్షన్‌ సీన్‌ను మించిన సాహాసం
ఈ కానిస్టేబుల్‌కి సెల్యూట్.. యాక్షన్‌ సీన్‌ను మించిన సాహాసం
షూటింగ్‏లో గాయపడిన హీరో సూర్య..
షూటింగ్‏లో గాయపడిన హీరో సూర్య..
వయనాడ్‌కు ప్రధాని మోడీ.. ఆ ప్రాంతాల పరిశీలన.. అధికారులతో సమావేశం
వయనాడ్‌కు ప్రధాని మోడీ.. ఆ ప్రాంతాల పరిశీలన.. అధికారులతో సమావేశం
స్మోకింగ్‌తో లంగ్స్‌ మాత్రమే కాదు.. ఈ అవయవాలు కూడా దెబ్బ తింటాయి.
స్మోకింగ్‌తో లంగ్స్‌ మాత్రమే కాదు.. ఈ అవయవాలు కూడా దెబ్బ తింటాయి.
జ్యోతిరాదిత్య సింధియాను కలిసిన మను భాకర్..
జ్యోతిరాదిత్య సింధియాను కలిసిన మను భాకర్..
ఆ ప్రత్యేక కారు బీమా గురించి మీకు తెలుసా? ప్రయాణించిన దూరమే ఆధారం
ఆ ప్రత్యేక కారు బీమా గురించి మీకు తెలుసా? ప్రయాణించిన దూరమే ఆధారం
మెగా వేలానికి ముందు బీసీసీఐ కీలక మార్పు.. ధోనికి లైన్ క్లియర్..
మెగా వేలానికి ముందు బీసీసీఐ కీలక మార్పు.. ధోనికి లైన్ క్లియర్..
దువ్వాడ శ్రీనివాస్‌తో తన రిలేషన్‌పై ఓపెన్ అయిపోయిన మాధూరి
దువ్వాడ శ్రీనివాస్‌తో తన రిలేషన్‌పై ఓపెన్ అయిపోయిన మాధూరి