AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీళ్లు అడిగిన భర్తను నిలువునా చంపేసిన భార్య.. తలను చిధ్రం చేసి మెదడు బయటకు తీసి..

ఈ మేరకు సిటీ ఏఎస్పీ సంజయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. సత్యపాల్‌కు వివాహమై 18 ఏళ్లు దాటింది. పిల్లలిద్దరూ కొంత దూరంలో ఉన్న మరో ఇంట్లో అమ్మమ్మతో కలిసి ఉంటున్నారని తెలిసింది. ఆ మహిళ మృతదేహం పట్ల అమానుషంగా ప్రవర్తించిన తీరును తెలిపాడు. ఆమె కూడా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్టుగా ఉందని, విచారణ జరుగుతోందని చెప్పాడు.

నీళ్లు అడిగిన భర్తను నిలువునా చంపేసిన భార్య.. తలను చిధ్రం చేసి మెదడు బయటకు తీసి..
A Woman Killed Her Husband
Jyothi Gadda
|

Updated on: Aug 09, 2024 | 9:27 PM

Share

నీళ్ళు అడిగిన విషయంలో గొడవలు రావడంతో ఓ మహిళ తన భర్త తలపై ఇటుకతో కొట్టి చంపేసింది. అంతటితో ఆగలేదు.. మృతదేహంపై కూర్చుని కిరాతకంగా ప్రవర్తించింది. ఇటుకలతో భర్త తలను నుజునుజ్జుగా చితకొట్టి నలిగిన తలలోంచి మెదడు బయటకు తీసింది..పోలీసుల కళ్లేదురుగానే మహిళ చేసిన ఈ ప్రవర్తనతో ఖాకీలు సహా అందరూ భయబ్రాంతులకు గురయ్యారు. ఈ దారుణ ఘటన యూపీలోని షాజహాన్‌పూర్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

హతోరా గ్రామానికి చెందిన సత్యపాల్ స్టేడియంలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. భార్య సావిత్రితో ఏదో ఒక విషయంలో తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే గురువారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో భోజనం చేస్తూ నీళ్ల కోసం భార్యను అడిగాడు. దాంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ వివాదం తీవ్రస్థాయికి చేరడంతో ఆ మహిళ తన భర్తను ఇటుకతో తలను నలిపి దారుణంగా హత్య చేసింది. అతను చనిపోయే వరకు తలపై కొట్టడం కొనసాగించింది. పోలీసులు వచ్చేసరికి సావిత్రి మృతదేహంపై కూర్చొని భర్త తలలోంచి మెదడు బయటకు తీసి అందరి ముందుకు విసిరి పారేస్తోంది. ఎలాగోలా ఆమెను కంట్రోల్ చేసిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఈ మేరకు సిటీ ఏఎస్పీ సంజయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. సత్యపాల్‌కు వివాహమై 18 ఏళ్లు దాటింది. మద్యం సేవించి తరచూ భార్యతో గొడవ పడేవాడని, పిల్లలిద్దరూ కొంత దూరంలో ఉన్న మరో ఇంట్లో అమ్మమ్మతో కలిసి ఉంటున్నారని తెలిసింది. ఆ మహిళ మృతదేహం పట్ల అమానుషంగా ప్రవర్తించిన తీరును తెలిపాడు. ఆమె కూడా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్టుగా ఉందని, విచారణ జరుగుతోందని చెప్పాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..