Watch : ఈ కానిస్టేబుల్‌కి సెల్యూట్ చేయాల్సిందే..! స్కూటీపై నేరస్థుడు ఎస్కేప్.. ప్రాణాలకు తెగించి మరీ..
మంజేష్ స్కూటీని వదిలేసి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఇలోగా, మరికొంత మంది బైకర్స్ ముందుకు వచ్చి అతన్ని చితకబాది పట్టుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవి కెమెరాలో రికార్డుకాగా, ప్రస్తుతం వీడియో వైరల్‌గా మారింది. కానిస్టేబుల్ లింగయ్య చేసిన ధైర్య సాహసాలకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రాణాలకు తెగించి నేరస్థుడిని పట్టుకున్న కానిస్టేబుల్ లింగయ్య ను ఉన్నతాధికారులు అభినందించారు.
యాక్షన్ సినిమా సన్నివేశాన్ని మించిన సీన్ ఇది..! ఒక 50 ఏళ్ల పోలీసు కానిస్టేబుల్ తన ప్రాణాలను పణంగా పెట్టి కరుడుగట్టిన నేరస్థుడిని పట్టుకున్నాడు. బైక్‌పై పారిపోతున్న చైన్‌స్నాచర్‌ని కానిస్టేబుల్ వెంబడించాడు. అతి కష్టం మీద ఎట్టకేలకు వాడిని అరెస్ట్ చేయగలిగాడు.. ఈ ఘటన మొత్తం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డైంది. కానిస్టేబుల్ చూపించిన ధైర్యసాహసాలు చూసి అందరూ శభాష్ అంటున్నారు. సోషల్ మీడియా వేదికగా అతనిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ షాకింగ్ ఘటన బెంగళూరులోని సదాశివనగర్‌లోని రద్దీగా ఉండే జంక్షన్‌లో చోటు చేసుకుంది. ఆగస్టు 6వ తేదీన జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
బెంగళూరులోని తుమకూరు జిల్లా కొరటగెరె పోలీస్ స్టేషన్‌కు చెందిన ఓ పోలీసు కానిస్టేబుల్ వీధి నిర్వహణలో తన ప్రాణాలు సైతం పణంగా పెట్టాడు. బెంగళూరులో మంజేష్ అలియాస్ 420 మాంజా అలియాస్ హోట్టె మాంజ అనే నేరస్థుడిని పట్టుకోవడానికి దొడ్డలింగయ్య అనే కానిస్టేబుల్ ఎవరూ చేయని సాహసం చేశాడు.. నేరస్థుడు మంజేష్ దాదాపు 40కి పైగా నేరాలకు పాల్పపడినట్టుగా సమాచారం. కొంతకాలంగా పోలీసులకు చిక్కుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే బెంగుళూరులో రద్దీగా ఉండే ప్రాంతంలో సివిల్ డ్రెస్ లో ఉన్న లింగయ్యకు సడెన్‌గా మంజేష్ కనిపించాడు. అతని ముఖానికి కర్చీఫ్ కట్టుకుని స్కూటీపై వెళ్లడం కానిస్టేబుల్ లింగయ్య గమనించాడు. అంతే ఒక్కసారిగా ముందుకు దూకి మంజేష్ స్కూటీని పట్టుకున్నాడు. అది గమనించిన మంజేష్ భయంతో బైక్‌ను స్టార్ట్ చేశాడు. అయినా కూడా కానిస్టేబుల్ స్కూటీని వదలకుండా పట్టుకున్నాడు. కానిస్టేబుల్ బైక్‌ను పట్టుకుని ఉండగానే.. నేరస్థుడు బైక్‌ను మరింత వేగంగా పరుగులు పెట్టించాడు. బైక్‌కు వేలాడుతున్న కానిస్టేబుల్‌ని దాదాపు 20మీటర్ల వరకు ఈడ్చుకెళ్లాడు. ఘటన మొత్తం ఆ ప్రాంతంలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.
అక్కడే డ్యూటీలో ఉన్న ఇద్దరు ట్రాఫిక్ కానిస్టుబుల్స్ వచ్చి ఆపే ప్రయత్నం చేయగా, మంజేష్ స్కూటీని వదిలేసి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఇలోగా, మరికొంత మంది బైకర్స్ ముందుకు వచ్చి అతన్ని చితకబాది పట్టుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవి కెమెరాలో రికార్డుకాగా, ప్రస్తుతం వీడియో వైరల్‌గా మారింది. కానిస్టేబుల్ లింగయ్య చేసిన ధైర్య సాహసాలకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రాణాలకు తెగించి నేరస్థుడిని పట్టుకున్న కానిస్టేబుల్ లింగయ్య ను ఉన్నతాధికారులు అభినందించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..