AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో.. పాములతో కలిసి జీవిస్తున్న గ్రామస్తులు..ఇంట్లోనే వాటికి గది, భోజనం..పిల్లలతో కలిసి ఆటలు..!

ఇద్దరూ ఒకరికొకరు భయపడరు, ఒకరితో ఒకరు కలిసి జీవిస్తారు. ఇక్కడ ఏ ఒక్క మనిషిని పాముకాటు వేసిన ఘటన జరగలేదని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇక్కడ ఇళ్లలోనే కాకుండా స్కూల్, క్లాస్ రూముల్లోనూ పాములు సంచరిస్తుంటాయి. అయితే పిల్లలు పాముల చుట్టూ తిరుగుతూ పెరుగుతుంటారు. కాబట్టి, పాములంటే వారికి ఎలాంటి భయం ఉండదట.

వామ్మో.. పాములతో కలిసి జీవిస్తున్న గ్రామస్తులు..ఇంట్లోనే వాటికి గది, భోజనం..పిల్లలతో కలిసి ఆటలు..!
Shetphal Village
Jyothi Gadda
|

Updated on: Aug 09, 2024 | 5:32 PM

Share

పాము ప్రస్తావన వింటేనే మనలో చాలా మందిలో వణుకు పుడుతుంది. ఇక పాము ఎదురుగా వస్తే ఏమవుతుందో ఊహించడానికే భయపడిపోతారు. కానీ, మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో ఓ వింత గ్రామం ఉంది. ఇక్కడ ప్రజలు తమ ఇళ్లలోకి పాములను ప్రత్యేకించి ఆహ్వానిస్తుంటారు. పాముల కోసం ఇక్కడి ప్రజల ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. షోలాపూర్ జిల్లాలో షెట్పాల్ అనే గ్రామంలో ఈ వింత ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

షెట్పాల్ అనే గ్రామంలోని ప్రతి ఇంట్లో పాములు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. ఇతర ప్రాంతాలలో ప్రజలు తమ ఇంటి పరిసరాల్లో ఎలాంటి చిన్న పాము కనిపించినా కూడా భయపడతారు. వెంటనే దాన్ని చంపేయటమో, లేదంటే స్నేక్‌క్యాచర్‌కు సమాచారం అందించటమో చేస్తుంటారు. కానీ,షెట్పాల్‌ గ్రామంలో ప్రజలు పాములను స్వచ్ఛందంగా స్వాగతిస్తారు. అది కూడా కింగ్ కోబ్రాలను కూడా..! ఇది మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు.. కానీ ఇది నిజం. ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో పాములు స్వేచ్చగా సంచరిస్తుంటే వాటిని ఎవరూ అడ్డుకోరట.

ఈ గ్రామంలోని 2600 మందికి పైగా గ్రామస్తులు నాగుపామును పూజిస్తారు. ఇక్కడ మనుషులు పాములకు, పాములు మనుషులకు హాని కలిగించకుండా ఉంటారు. ఇద్దరూ ఒకరికొకరు భయపడరు, ఒకరితో ఒకరు కలిసి జీవిస్తారు. ఇక్కడ ఏ ఒక్క మనిషిని పాముకాటు వేసిన ఘటన జరగలేదని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇక్కడ ఇళ్లలోనే కాకుండా  స్కూల్, క్లాస్ రూముల్లోనూ పాములు సంచరిస్తుంటాయి. అయితే పిల్లలు పాముల చుట్టూ తిరుగుతూ పెరుగుతుంటారు. కాబట్టి, పాములంటే వారికి ఎలాంటి భయం ఉండదట. ఇక్కడ కొత్తగా ఇల్లు కట్టుకునే వారు పాములకు ప్రత్యేకించి ఒక ప్రదేశాన్ని కేటాయిస్తారు. దానిని నాగుపాముల దేవస్థానంగా పిలుచుకుంటారు.

ఇవి కూడా చదవండి

పాములు వచ్చి పోయేందుకు ప్రతి ఇంట్లో ఇలాంటి నిర్మాణం ఉంటుంది. పాములతో కలిసి జీవించే ఈ ఆచారం ఎప్పుడు, ఎలా మొదలైందో ఎవరికీ తెలియదు. కానీ, ఇప్పుడు ఇక్కడి ప్రజల జీవితంలో పాములు భాగమయ్యాయి. బయటి వ్యక్తి ఇక్కడికి వస్తే మాత్రం భయంతో వణికిపోవాల్సిందే.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..