AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వయనాడ్ ప్రకృతి విలయం.. ప్రజల్ని కాపాడిన పెంపుడు చిలుక..! ఎలాగంటే..

ప్రమాదానికి ముందురోజు వినోద్ తన చిలుక కింగినితో సోదరి ఇంటికి వచ్చాడట. అయితే, అదేరోజున ఆ చిలుక ఒక్కసారిగా బిగ్గరగా అరుస్తూ పంజరాన్ని నోటితో పొడుస్తూ ప్రకృతి విలయ విపత్తుపై హెచ్చరించింది. వెంటనే వినోద్ తేరుకొని తన స్నేహితులు, ఇరుగు పొరుగువారిని అలర్ట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయేలా చేశారు. దీనిని బట్టి కూడా మూగజీవులకు

వయనాడ్ ప్రకృతి విలయం.. ప్రజల్ని కాపాడిన పెంపుడు చిలుక..! ఎలాగంటే..
Pet Parrot
Jyothi Gadda
|

Updated on: Aug 08, 2024 | 10:13 PM

Share

పక్షులు, జంతువులు రాబోయే ఆపదను, ప్రకృతి విపత్తులను ముందుగానే పసిగడతాయని పెద్దలు తరచూ చెబుతుంటారు. అందుకు నిదర్శనంగానే కేరళలో ఓ చిలుక ప్రకృతి విలయం నుంచి తమ యజమానితో పాటు చుట్టుపక్కల ప్రజలను కాపాడింది. ఇటివల కొండచరియలు విరిగిపడిన వాయనాడ్‌లోని చూరల్‌మల నివాసి కెఎమ్ వినోద్‌కు కింగిని అనే పెంపుడు చిలుక ఉంది. ఆ చిలుక రాబోయే విపత్తును ముందుగానే అర్థం చేసుకుని హెచ్చరించింది.

ప్రమాదానికి ముందురోజు వినోద్ తన చిలుక కింగినితో సోదరి ఇంటికి వచ్చాడట. అయితే, అదేరోజున ఆ చిలుక ఒక్కసారిగా బిగ్గరగా అరుస్తూ పంజరాన్ని నోటితో పొడుస్తూ ప్రకృతి విలయ విపత్తుపై హెచ్చరించింది. వెంటనే వినోద్ తేరుకొని తన స్నేహితులు, ఇరుగు పొరుగువారిని అలర్ట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయేలా చేశారు. దీనిని బట్టి కూడా మూగజీవులకు విపత్తులను పసిగట్టే గుణం ఉంటుందని చెబుతున్నారు.

కింగిని యజమాని వినోద్ మాట్లాడుతూ..జూలై 30న విపత్తు సంభవించడానికి ముందు తన చిలుక గట్టిగా అరుస్తూ ఏడ్చిందని చెప్పాడు. దాని వికృత ప్రవర్తన తమకు ముందస్తు హెచ్చరికగా పనిచేశాయని చెప్పాడు. కొండచరియలు విరిగిపడే సమయానికి తన చిలుక ప్రవర్తన కారణంగా తామంతా తప్పించుకోగలిగామని వాయనాడ్‌లోని ఒక రక్షత శిభిరంలో ఉన్న వినోద్‌ వివరించారు. అక్కడ అతను ప్రస్తుతం వందలాది మంది ఇతర నిర్వాసితులతో నివసిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..