AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: సింహంతో గ్రేమ్సా..! ఎమరపాటుగా ఉందని ఏకంగా తలపైనే చేయి వేశాడు.. ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే..

సోషల్ మీడియాలో వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఒక రోజు క్రితం షేర్ అయిన ఈ వీడియోకు ఇప్పటికే లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి. వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ఇలా చేయడం డేంజర్‌ అంటూ కొందరు. కోరి ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్టే అంటూ మరికొందరు కామెంట్‌ చేశారు. ఇలాంటి సఫారీ టూర్లను రద్దు చేయాలంటూ కూడా కొందరు నెటిజన్లు కామెంట్లు చేశారు.

Viral Video: సింహంతో గ్రేమ్సా..! ఎమరపాటుగా ఉందని ఏకంగా తలపైనే చేయి వేశాడు.. ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే..
Man Disturbing Lion
Jyothi Gadda
|

Updated on: Aug 09, 2024 | 3:33 PM

Share

సింహంతో జోక్ చేయడం చాలా ఖర్చుతో కూడుకున్నదే. అడవికి రాజైన సింహం కనిపిస్తే.. ఏ జంతువైనా, మనిషి అయినా సరే.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోవాల్సిందే. కానీ, ప్రస్తుతం చాలా మంది అడవి జంతువులను నేరుగా చూసేందుకు సఫారీ టూర్లకు వెళ్తుంటారు. ఇక్కడ పులులు, సింహాలతో పాటు అనేక రకాలైన క్రూరజంతువులు, అడవి జంతువులను వారు చాలా దగ్గరగా చూసే అవకాశం ఉంటుంది. అలాంటి జంగిల్‌ సఫారీ కోసం వెళ్లిన ఓ వ్యక్తి ఏకంగా సింహంతోనే ఎకసెక్కాలకు పోయాడు. ఆ తర్వాత జరిగిన పరిణామం ఊహించలేనిదిగా ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయిన ఈ క్లిప్‌లో సఫారీ జీప్‌పై ప్రయాణిస్తున్న ఒక పర్యాటకుడు చేసిన పనితో అడవి రాజు సింహానికి చిర్రెత్తుకొచ్చింది. ఈ దృశ్యం ఇప్పుడు ఇంటర్నెట్ జనాలను భయాందోళనకు గురిచేసింది.

wildtrails.in అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ చేయగా, ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వీడియోలో కనిపించిన విధంగా ఒక పర్యాటక బృందం.. జీప్‌లో సఫారీ పర్యటనకు వెళ్లింది. ఒక దగ్గర జీప్‌ను ఆపి పక్కకు పెట్టారు. దాని పక్కనే ఓ సింహం కూర్చుని ఉంది. ఆ సమయంలో జీప్‌లోని ఓ వ్యక్తి సింహం తలపై నిమిరేందుకు ప్రయత్నించాడు. సింహం తలపై భయంభయంగానే చెయ్యి వేశాడు. ఒకసారి అందలేదు.. కానీ, మరోసారి ట్రై చేశాడు.. అతడి చేతి స్పర్శ తగలగానే సింహం వేగంగా, చాలా కోపంగా తల పైకెత్తి చూసింది. అయితే అప్పటికే ఆ వ్యక్తి భయంతో లోపలికి వెళ్లిపోవడంతో సింహం శాంతించింది. ఈ షాకింగ్ వీడియో చూసిన నెటిజన్లు ఆ వ్యక్తిపై విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా, ఈ వీడియో కెన్యాకు సంబంధించినదిగా తెలిసింది. సోషల్ మీడియాలో వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఒక రోజు క్రితం షేర్ అయిన ఈ వీడియోకు ఇప్పటికే లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి. వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ఇలా చేయడం డేంజర్‌ అంటూ కొందరు. కోరి ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్టే అంటూ మరికొందరు కామెంట్‌ చేశారు. ఇలాంటి సఫారీ టూర్లను రద్దు చేయాలంటూ కూడా కొందరు నెటిజన్లు కామెంట్లు చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..