Odd News: గాఢ నిద్రలో తల్లిదండ్రులు.. 6 నెలల చిన్నారిని సజీవంగా తినేసిన ఎలుకలు.. ఎక్కడంటే..
Indiana Boy Eaten Alive By Rats: 6 నెలల పాసికందుపై ఎలుకల గుంపు దాడి చేసింది.. సజీవంగా కొరికి చంపేసింది. పిల్లవాడు తన ఊయలలో హాయిగా నిద్రపోతున్నాడు. ఆ సమయంలో పసిబాలుడిపై ఎలుకలు దాడి చేశాయి. పిల్లాడిని ఎలుకలు దాదాపు 50సార్లకు పైగా కరిచాయి. ఈ ఘటన తర్వాత పోలీసులు పలు ఆశ్చర్యమైన విషయాలను బయట పెట్టారు. వారికి ఈ బాలుడి కంటే ముందు నలుగురు పిల్లలు ఉన్నట్లుగా గుర్తించారు. వీరు మాత్రమే కాకుండా మరో ఇద్దరు బంధువుల పిల్లలు కూడా వీరితోనే..

ఇండియానా దారుణ సంఘటన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ 6 నెలల పాసికందుపై ఎలుకల గుంపు దాడి చేసింది.. సజీవంగా కొరికి చంపేసింది. పిల్లవాడు తన ఊయలలో హాయిగా నిద్రపోతున్నాడు. ఆ సమయంలో పసిబాలుడిపై ఎలుకలు దాడి చేశాయి. పిల్లాడిని ఎలుకలు దాదాపు 50సార్లకు పైగా కరిచాయని.. కొరికివేయడమే కాకుండా శరీరాన్ని దారుణంగా తినేశాయని తెలుస్తోంది. మరుసటి రోజు ఉదయం రక్తం మడుగులో తడిసిన చిన్నారిని తల్లిదండ్రుల గమనించారు.
న్యూయార్క్ పోస్ట్ ప్రచూరించిన వార్త ప్రకారం, ఈ సంఘటన బుధవారం జరిగింది. పిల్లల తల్లిదండ్రులు డేవిడ్, ఏంజెల్ షోనాబామ్ రక్తం మడుగులో ఉన్న తమ కొడుకును చూసి ఆశ్చర్యపోయారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తల్లిదండ్రులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని సరైన రీతిలో పట్టించుకోలేదని, నిర్లక్ష్యం చేస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో నిందితుల్లో తల్లిదండ్రులే కాకుండా చిన్నారి అత్త డెలానియా థుర్మాన్ పేరు కూడా చేర్చారు. అదే ఇంట్లో నివసిస్తున్న డెలానియాను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చిన్నారి శరీరం నుంచి రక్తం కారుతోంది..
పిల్లాడి చెంపలు, ముక్కు, నుదురు, కాళ్ళు, చేతులు, తొడలు, కాలి వేళ్లపై ఎలుకలు కరిచన గుర్తులు చాలా ఉన్నాయి.దీంతో చిన్నారికి చాలా రక్తస్రావం జరిగింది. పిల్లాడి కుడిచేతిని మోచేతి వరకు ఎలుకలు కొరికేశాయని పోలీసులు తెలిపారు. అతని వేళ్లలోని కొన్ని భాగాలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఎముకలు బయటకు వచ్చాయి. ఈ సంఘటన తర్వాత.. పిల్లవాడిని వెంటనే ఇండియానాపోలిస్‌లోని ఆసుపత్రిలో చేర్చారు.
ఇంతకు ముందు కూడా చాలాసార్లు ఎలుకలు..
ఈ ఘటన తర్వాత పోలీసులు పలు ఆశ్చర్యమైన విషయాలను బయట పెట్టారు. వారికి ఈ బాలుడి కంటే ముందు నలుగురు పిల్లలు ఉన్నట్లుగా గుర్తించారు. వీరు మాత్రమే కాకుండా మరో ఇద్దరు బంధువుల పిల్లలు కూడా వీరితోనే ఉంటున్నారు. ఈ కుటుంబం నివసించే ఇంట్లో చాలా అపరిశుభ్రత ఉందని తెలిపారు. ఇల్లంతా చెత్తాచెదారం, ఎలుకల గుట్టలతో నిండిపోయింది. ఇంట్లో ఉన్న చిన్నారిని ఎలుక కాటు వేయడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు ఇంట్లోని మరో ఇద్దరు పిల్లలను నిద్రిస్తున్న సమయంలో ఎలుకలు తీవ్రంగా కరిచినట్లుగా పోలీసులు గుర్తించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం
