Corona Virus: ఆ దేశంలో మొదలైన కరోనా నాల్గో వేవ్ .. భారీగా కొత్త కేసులు.. ఆంక్షలు కఠినతరం

Fourth Wave In France: ప్రపంచంలో కరోనా సృష్టిస్తున్న కరోనా కల్లోలం ఇంకా కొనసాగుతూనే ఉంది. అమెరికా, మెక్సికో, స్పెయిన్ , ఇండోనేషియా వంటి దేశాలు ఇప్పటికే అడుగు పెట్టగా...

Corona Virus: ఆ దేశంలో మొదలైన కరోనా నాల్గో వేవ్ .. భారీగా కొత్త కేసులు.. ఆంక్షలు కఠినతరం
Fourth Wave In France

Edited By:

Updated on: Jul 23, 2021 | 2:38 PM

Fourth Wave In France: ప్రపంచంలో కరోనా సృష్టిస్తున్న కరోనా కల్లోలం ఇంకా కొనసాగుతూనే ఉంది. అమెరికా, మెక్సికో, స్పెయిన్ , ఇండోనేషియా వంటి దేశాలు ఇప్పటికే అడుగు పెట్టగా.. పాకిస్టన్ కరోనా నాలుగులో దశలో ఉందని ఆ దేశ నేతలు ఇప్పటికే ప్రకటించారు. అయితే తాజాగా యూరోపియన్ కంట్రీ ఫ్రాన్స్ లో కరోనా నాలుగో దశలో అడుగు పెట్టిందని ఆదేశ ప్రభుత్వ ప్రతినిధి గాబ్రియేల్ అట్టర్ అధికారికంగా ప్రకటించారు. ఫోర్త్ వేవ్ లో భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ లో కఠిన ఆంక్షలు విధిస్తున్నామని తెలిపారు.

ఇక కరోనా కట్టడి కోసం సినిమా థియేటర్స్ , మ్యూజియంలు, పార్కులు, స్విమ్మింగ్ పూల్స్ ఇలా జనం ఎక్కువగా ఉండే ప్రాంతాలను సందర్శించే వారికీ కొన్ని నిబంధనలు విధించింది. వీటిని సందర్శించుకోవాలనుకునేవారు తప్పనిసరిగా కొవిడ్‌ టీకా ధ్రువీకరణ పత్రం లేదా నెగటివ్ టెస్టును చూపించాలని తెలిపింది.

ఇక ఫోర్త్ వేవ్ కట్టడికోసం ఫ్రాన్స్ వ్యాక్సిన్ పాస్ పోర్ట్ సిస్టం అమల్లోకి తెచ్చింది. దీంతో ఎక్కడైనా 50 మంది కంటే ఎక్కువ మంది ఉంటె వారు హెల్త్ పాస్ ని చూపించాలి.. అయితే ఈ హెల్త్ పాస్ లను వ్యాక్సిన్ వేయించుకున్నవారికి మాత్రమే ఇస్తామని ఫ్రాన్స్ ప్రధాని జీన్ కాస్టెక్స్‌ ప్రకటించారు. దేశవ్యాప్తంగా నాల్గో లాక్ డౌన్ విధించకుండా హెల్త్ పాస్ పాలసీని అమల్లోకి తీసుకొచ్చినట్టు ప్రధాని జీన్ తెలిపారు. ఇక ఈ హెల్త్ పాస్ నిబంధనలు ఉల్లంఘించినవారికి భారీగా జరిమానాలు విధించడానికి రంగం సిధ్దం చేస్తున్నారు. పదే పదే కరోనా నిబంధనలు ఉల్లంగిస్తే.. ఏడాది పాటు జైలు శిక్ష విధించనున్నామని ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రకటించింది.

గత వారం రోజులుగా అక్కడ కేసులు నమోదు 140 శాతానికి పెరిగింది. 23 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అయితే ఈ కొత్తగా నమోదైన కేసుల్లో ఎక్కువ మంది వ్యాక్సిన్ తీసుకున్నవారు ఉండడంతో ఆందోళన రేకెత్తిస్తోంది. అయితే కరోనా వ్యాక్సిన్ తీసుకొని వారికీ కఠిన నిబంధనలను ప్రకటించింది. వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతం చేసింది.

Also Read: Cyberabad CP: నకిలీ వెబ్‌సైట్లతో ఘరానా మోసం.. చెక్ పెట్టిన సైబరాబాద్ పోలీసులు.. తస్మాత్ జాగ్రత్త అంటూ..

Tokyo Olympics 2021 Live: పురుషుల ఆర్చరీ ర్యాంకింగ్ రౌండ్ భారత ప్లేయర్స్ పేలవ ప్రదర్శన..