New York Shooting: అమెరికాలో మరోసారి పేలిన తూట.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి!
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేపాయి. న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో ఉన్న ఓ నైట్‌క్లబ్‌లోకి చొరబడిన కొందరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో స్పాట్‌లోనే ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చైస్తున్నారు.

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేపాయి. న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో ఉన్న ఓ నైట్‌క్లబ్‌లోకి చొరబడిన కొందరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో స్పాట్‌లోనే ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక మీడియాల కథనాల ప్రకారం.. క్రౌన్ హైట్స్‌లోని ఫ్రాంక్లిన్ అవెన్యూలో ఉన్న ‘టేస్ట్ ఆఫ్ ది సిటీ’ అనే నైట్ క్లబ్‌లో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో కాల్పుల ఘటనపై తమకు సమాచారం వచ్చినట్ట స్థానిక పోలీసులు తెలిపారు. మొదట చిన్నగా మొదలైన గొడవ మాటా మాటా పెరగడంతో పెద్దదై.. కాల్పులు జరిపే వరకు వెళ్లినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. స్పాట్‌లో మూడు మృతదేహాలతో పాటు ఒక తుపాకి, 36 బుల్లెట్ షెల్స్ స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: డేగ కన్ను కంటే పవర్‌ఫుల్.. 4 కి.మీ టార్గెట్‌ను క్లియర్ చేసిన ఉక్రెయిన్ స్నైపర్.. ఇద్దరు రష్యన్ సైనికుల హతం!
ఈ ఘటనలో మొత్తం బాధితులు 11 మంది కాగా అందులో చనిపోయిన ముగ్గురు పురుషులు, మిగతా ఎనిమిది మందితో ముగ్గురు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. దుండగుల దాడిలో గాయపడిన వారందూ ప్రస్తుతం స్థానిక ఆసుపత్రులకు చికిత్స పొందుతున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం కూడా నిలకడగానే ఉందన్నారు.
ఇది కూడా చదవండి: చేతిలో గన్‌తో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు.. కట్ చేస్తే.. క్లైమాక్స్‌లో షాకిచ్చాడు..!
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
