AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Record: డేగ కన్ను కంటే పవర్‌ఫుల్.. 4 కి.మీ టార్గెట్‌ను క్లియర్‌ చేసిన ఉక్రెయిన్‌ స్నైపర్.. ఇద్దరు రష్యన్‌ సైనికుల హతం!

రష్యాతో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌కు చెందిన ఓ స్నైపర్ ప్రపంచ రికార్డును క్రియేట్‌ చేశాడు. తన దగ్గరున్న అధునాతన స్నైఫర్‌తో 13,000 అడుగుల(4KM) దూరంలో ఉన్న ఇద్దరు రష్యా సైనికుడిని కాల్చి చంపి ప్రపంచంలోనే లాంగేస్ట్‌ షూటర్‌గా చరిత్ర సృష్టించాడు.

World Record: డేగ కన్ను కంటే పవర్‌ఫుల్.. 4 కి.మీ టార్గెట్‌ను క్లియర్‌ చేసిన ఉక్రెయిన్‌ స్నైపర్.. ఇద్దరు రష్యన్‌ సైనికుల హతం!
Ukrainian Sniper World Record (1)
Anand T
|

Updated on: Aug 17, 2025 | 5:29 PM

Share

రష్యాతో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌కు చెందిన ఓ స్నైపర్ ప్రపంచ రికార్డును క్రియేట్‌ చేశాడు. తన దగ్గరున్న అధునాతన స్నైఫర్‌తో 13,000 అడుగుల(4KM) దూరంలో ఉన్న ఇద్దరు రష్యా సైనికుడిని కాల్చి చంపి ప్రపంచంలోనే లాంగేస్ట్‌ షూటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ సంఘటన పోక్రోవ్స్కో-మిర్నోగ్రాడ్ లో ఆగస్ట్‌ 14వ లేదీన చోటుసేకున్నట్టు సైనిక వర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్‌లో తయారు చేసిన అధునాతన ఎలిగేటర్ 14.5 MM రైఫిల్‌తో ప్రైవిడ్ నుండి ఒక స్నైపర్ 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇద్దరు రష్యా సైనికులను కాల్చిచంపినట్టు తెలిపారు.

ఇది కూడా చదవండి: ఆర్టీసీ కండక్టర్‌పై ప్రయాణికురాలి దాడి.. కారణం తెలిస్తే అవాకవ్వాల్సిందే!

ఈ టార్గెట్‌ను చేధించేందుకు సదురు స్నైపర్‌ నిఘా UAV, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డ్రోన్ టెక్నాలజీని వినియోగించినట్టు మిలిటరీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఎలిగేటర్ అనేది ఉక్రేనియన్ మల్టీ-షాట్, మాన్యువల్‌గా లోడ్ చేయబడిన, లార్జ్-క్యాలిబర్ యాంటీ-మెటీరియల్ రైఫిల్. దీనిని 2020 వ సంవత్సరంలో సైనిక సేవ కోసం తయారు చేసినట్టు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: ప్రపంచంలోనే అత్యంత దురదృష్టకర పాము ఇదేనట.. ఎందుకో తెలుసా?

గతంలోనే అత్యంత దూరంలో ఉన్న టార్గెట్‌ను చేధించిన ప్రపంచ రికార్డు కూడా ఉక్రేనియన్ చెందిన స్నైపర్ పేరు మీదే ఉంది. గత నవంబర్ 2023లో, SBU యూనిట్ నుండి వచ్చిన ఒక ఉక్రేనియన్ స్నైపర్‌ ఖేర్సన్ ప్రాంతంలో 3,800 మీటర్ల దూరంలోలో ఉన్న ఒక రష్యన్‌ సైనికుడిని తన రైఫిల్‌తో కాల్చి చంపి ప్రపంచ రికార్డు క్రియేట్‌ చేయగా తాజా ఘటనతో ఆ రికార్డు బద్దలైది. రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య జరిగిన శిఖరాగ్ర సమావేశానికి ఒక రోజు ముందే ఈ రికార్డు నమోదు కావడం గమనార్హం.

ఎలిగేటర్ 14.5 MM రైఫిల్‌..

ఎలిగేటర్ రైఫిల్ నుంచి వడుదలయ్యే బుల్లెట్ సెకనుకు 980 మీటర్ల వేగంతో దూసుకెళ్తుందట. అంతేకాదు ఈ బుల్లెట్ గరిష్ట పరిధి 7000 మీ వరకు ఉంటుందట. స్నైపర్‌ నుంచి రీలీజ్‌ అయిన బుల్లెట్ 1.5 కి.మీ దూరంలో ఉన్న 10 మి.మీ ఆర్మర్ ప్లేట్‌ను కూడా డ్యామేజ్ చేస్తుందట. ఈ రైఫిల్‌ను ముఖ్యంగా శత్రువు కోటలు, పరికరాలను నాశనం చేయడం కోసం తయారు చేశారట. ఈ రైఫిల్ మొత్తం బరువు 22.5 కిలోలు ఉంటుందట.

ఇది కూడా చదవండి: మరోసారి బయటపడిన ట్రంప్‌ ద్వంద వైఖరి.. రష్యా-అమెరికా వాణిజ్యంపై పుతిన్‌ సంచలన ప్రకటన!

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.