తండ్రి కళ్లముందే కొడుకును చంపి తినేసిన షార్క్.. వైరల్ అవుతున్న వీడియో..
బీచ్‌లో ఈదుతున్న ఓ యువకుడిని షార్క్ చేప తినేసింది. ఈజిప్టులోని ఎర్ర సముద్రంలో జరిగిన ఈ దుర్ఘటన కారణంగా రష్యాకు చెందిన 23 ఏళ్ల పోపోన్ అనే వ్యక్తి మరణించాడు. ఈజిప్ట్‌ను సందర్శించాలనుకున్న పోపోన్ సకుటుంబ యాత్ర కోసం ఆ దేశానికి చేరుకున్నాడు. తన యాత్రలో భాగంగానే ఎర్రసముద్రంలోని..
బీచ్‌లో ఈదుతున్న ఓ యువకుడిని షార్క్ చేప తినేసింది. ఈజిప్టులోని ఎర్ర సముద్రంలో జరిగిన ఈ దుర్ఘటన కారణంగా రష్యాకు చెందిన 23 ఏళ్ల పోపోన్ అనే వ్యక్తి మరణించాడు. ఈజిప్ట్‌ను సందర్శించాలనుకున్న పోపోన్ సకుటుంబ యాత్ర కోసం ఆ దేశానికి చేరుకున్నాడు. తన యాత్రలో భాగంగానే ఎర్రసముద్రంలోని ఓ రిసార్ట్‌లో బస చేసి గురువారం తన ప్రియురాలితో కలిసి తీరంలో ఈతకు వెళ్లాడు. అయితే ఇంతలో అక్కడకు వచ్చిన టైగర్ షార్క్ అతనిపై దాడి చేసింది. తనను కాపాడమంటూ ఎంతగానో కేకలు వేస్తూ.. తీరానికి చేరుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఫలితం లేకపోయింది. అందరూ చూస్తుండగానే అంతా అయిపోయింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైలర్‌గా మారింది.
అయితే తన కొడుకును షార్క్ తినేయడం చూసిన పోపోన్ తండ్రి షాకయ్యాడు. అతనే కాదు.. అక్కడకు వచ్చినవారు కూడా ఒక్క సారిగా నిర్ఘాంతపోయి చూస్తుండిపోయారు. అంతా సెకన్ల వ్యవధిలోనే అయిపోయిన ఈ దుర్ఘటన గురించి పోపోన్ తండ్రి మాట్లాడుతూ.. తాము రిలాక్స్ అయ్యేందుకు బీచ్‌కు వెళ్లామని, ఈత కొట్టేందుకు వెళ్లిన తన కొడుకును షార్క్ అటాక్ చేసి తినేసిందని, ఇదంతా కేవలం సెకండ్ల వ్యవధిలో జరిగిపోయిందని కన్నీరు పెట్టుకున్నాడు.
#مصر (+18) سائح روسي يسبح على شاطئ الغردقة (الغردقة) يتعرض لهجوم من سمكة قرش يقال أن القرش أكل الرجل بالكامل. مخيف جداpic.twitter.com/SI7yw3frd2
— د. رهف اليماني ?? (@rahafalyemeni) June 8, 2023
ఇదిలా ఉండగా పోపోన్‌ను తినేసిన టైగర్ షార్క్‌ను అదుపులోకి తీసుకున్నామని.. సురక్షిత బీచ్‌లో ఈ ఆకస్మిక దాడికి గల కారణాలేమిటో విచారిస్తున్నామని ఈజిప్ట్ పర్యావరణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే తీరప్రాంతంలోని 46-మైలు(74కిమీ) విస్తీర్ణాన్ని ఆదివారం వరకు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇంకా ఈ సందర్భంగా నీటిలోకి దిగేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, నిషేధిత బీచ్‌ల్లో ఈతకు దిగవద్దని తమ సందర్శకులను ఈజిప్ట్ ప్రభుత్వం కోరింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..