Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google: ‘ఇకపై వారానికి 3 మూడు రోజులు.. లేకుంటే చర్యలు తప్పవు’.. ఉద్యోగుల‌కు గూగుల్ వార్నింగ్‌

Google: కరోనా కారణంతో ప్రపంచ ఐటీ కంపెనీలు అన్నీ కూడా వర్క్​ఫ్రం హోం సిస్టమ్‌ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.. కానీ, ఇప్పుడు పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్న క్రమంలో మళ్లీ ఆఫీసులకు రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేస్తున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో టెక్‌ దిగ్గజం గూగుల్‌..

Google: ‘ఇకపై వారానికి 3 మూడు రోజులు.. లేకుంటే చర్యలు తప్పవు’.. ఉద్యోగుల‌కు గూగుల్ వార్నింగ్‌
Google
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jun 09, 2023 | 8:47 PM

Google: కరోనా కారణంతో ప్రపంచ ఐటీ కంపెనీలు అన్నీ కూడా వర్క్​ఫ్రం హోం సిస్టమ్‌ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.. కానీ, ఇప్పుడు పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్న క్రమంలో మళ్లీ ఆఫీసులకు రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేస్తున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో టెక్‌ దిగ్గజం గూగుల్‌ చేరిపోయింది. రిటర్న్ టూ ఆఫీస్ పాలసీని ప్రకటించింది. వారానికి కచ్చితంగా మూడు రోజులు ఆఫీసుకు వచ్చి పనిచేయాల్సిందేనని గూగుల్‌ తమ ఉద్యోగులకు తేల్చి చెప్పింది. ఇకపై ఉద్యోగుల పనితీరును అంచనా వేయడంలో హాజరు శాతాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటామని మెయిల్‌ పంపింది. రిట‌న్ టూ ఆఫీస్ పాల‌సీకి విరుద్ధంగా వ్యవ‌హ‌రించే ఉద్యోగులు పేల‌వమైన పెర్ఫామెన్స్ రివ్యూ పొందుతార‌ని హెచ్చరించింది.

పెర్ఫామెన్స్ రివ్యూ సంద‌ర్భంగా ఉద్యోగుల హాజ‌రును త‌నిఖీ చేస్తామ‌ని తేల్చిచెప్పింది. మేలో జరిగిన గూగుల్‌ వార్షిక సమావేశంలో ఆవిష్కరించిన ప్రొడక్ట్‌లలో చాలా వరకు ఒకే దగ్గర కూర్చొని సమన్వయం చేసుకున్న ఉద్యోగులే అభివృద్ధి చేశారని గూగుల్‌ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆఫీసులో సమన్వయంతో పనిచేయడం వల్ల మంచి ఫలితాలు సాధించొచ్చని తెలిపింది. అయితే, వర్క్‌ ఫ్రమ్‌ హోం విధానంపై కంపెనీ తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అస్పష్టమైన హాజరు విధానాల ద్వారా తమ పనితీరును అంచనా వేయడం ఏమాత్రం సరికాదని ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ తెలిపారు.

కాగా, ప్రస్తుతం గూగుల్ హైబ్రిడ్ పాలసీని అమలు చేస్తోంది. అంటే ఉద్యోగులు వారంలో కనీసం మూడు రోజులు ఆఫీసులో రిపోర్ట్ చేయాలి. ప్రస్తుతం తీసుకొచ్చిన రిటర్న్ టూ పాలసీ ద్వారా ఎవరైతే తరుచుగా ఆఫీసులకు రాకుండా అటెండెన్స్ మెయిటెయిన్ చేయకుండా ఉంటారో వారికి హెచ్చరికలు వెళ్తుంటాయి. అంటే అటెండెన్స్ సరిగ్గా లేకపోతే వల్ల శాలరీ హైక్స్, ప్రమోషన్స్‌లో ప్రభావం పడుతుందని గూగుల్ తన ఉద్యోగులను పరోక్షంగా హెచ్చరించినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

కైలాస యాత్రలోని ఈ ప్రదేశాలు నేటికీ సైన్స్ చేధించని మిస్టరీలు
కైలాస యాత్రలోని ఈ ప్రదేశాలు నేటికీ సైన్స్ చేధించని మిస్టరీలు
తీరికలేని జీవితాలు.. పిల్లలకు భారమవుతున్న కన్నవారు..
తీరికలేని జీవితాలు.. పిల్లలకు భారమవుతున్న కన్నవారు..
వికెట్ పడిందంటూ ఎగేసుకుంటూ వచ్చాడు.. కట్‌చేస్తే.. అంపైర్ దెబ్బకు
వికెట్ పడిందంటూ ఎగేసుకుంటూ వచ్చాడు.. కట్‌చేస్తే.. అంపైర్ దెబ్బకు
ఈ రైలు ప్రయాణికుల పాలిట అన్నపూర్ణ..
ఈ రైలు ప్రయాణికుల పాలిట అన్నపూర్ణ..
ఆల్కహాల్ లాగానే.. ఈ 5 ఆహారాలు లివర్‌కు యమ డేంజర్.. జర భద్రం..
ఆల్కహాల్ లాగానే.. ఈ 5 ఆహారాలు లివర్‌కు యమ డేంజర్.. జర భద్రం..
నిజమైన మనిషి పుర్రె, ఎముకలు ఆన్‌లైన్‌లో అమ్ముతున్న మహిళ!
నిజమైన మనిషి పుర్రె, ఎముకలు ఆన్‌లైన్‌లో అమ్ముతున్న మహిళ!
అల్లు అర్జున్ సినిమాలో ముగ్గురు బాలీవుడ్ హీరోయిన్స్..
అల్లు అర్జున్ సినిమాలో ముగ్గురు బాలీవుడ్ హీరోయిన్స్..
ధోని మనస్సు దోచిన నయా కారు.. ప్రత్యేకతలు తెలిస్తే నివ్వెరపోతారంతే
ధోని మనస్సు దోచిన నయా కారు.. ప్రత్యేకతలు తెలిస్తే నివ్వెరపోతారంతే
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన లేడీ యూట్యూబర్‌..! ఎక్కడంటే..
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన లేడీ యూట్యూబర్‌..! ఎక్కడంటే..
భార్యతో విడాకులు.. క్లోజ్ ఫ్రెండ్‌తో ఎఫైర్ రూమర్స్.. కట్‌చేస్తే..
భార్యతో విడాకులు.. క్లోజ్ ఫ్రెండ్‌తో ఎఫైర్ రూమర్స్.. కట్‌చేస్తే..