Noise Smart Watch: నాయిస్ నుంచి మరో న్యూ స్మార్ట్ వాచ్.. ఈ వాచ్ ఫీచర్స్ తెలిస్తే మీ ‘ఫ్యూజ్’లు ఎగిరిపోతాయంతే..!
ప్రముఖ స్మార్ట్ వాచ్ తయారీ సంస్థ నాయిస్ ముందు ఉంటుంది. వినియోగదారులకు తక్కువ ధరలో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో వచ్చే నాయిస్ వాచ్‌లను యువత ఎక్కువగా ఇష్టపడుతుంటారు. తాజాగా నాయిస్ మరో కొత్త స్మార్ట్ వాచ్‌తో వినియోగదారుల ముందుకు వచ్చింది.
భారతదేశంలో రోజురోజుకూ స్మార్ట్ యాక్ససరీస్ వినియోగం విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా స్మార్ట్ వాచ్‌లను యువత ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీంతో కేవలం స్మార్ట్ వాచ్‌లు మాత్రమే తయారు చేసేలా కొన్ని కంపెనీలు భారతదేశంలో ప్రారంభమయ్యాయి. ఎప్పటికప్పుడు నూతన మోడల్స్‌లో స్మార్ట్ వాచ్‌లను రిలీజ్ చేస్తూ వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఈ కోవలో ప్రముఖ స్మార్ట్ వాచ్ తయారీ సంస్థ నాయిస్ ముందు ఉంటుంది. వినియోగదారులకు తక్కువ ధరలో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో వచ్చే నాయిస్ వాచ్‌లను యువత ఎక్కువగా ఇష్టపడుతుంటారు. తాజాగా నాయిస్ మరో కొత్త స్మార్ట్ వాచ్‌తో వినియోగదారుల ముందుకు వచ్చింది. నాయిస్ ఫ్యూజ్ స్మార్ట్ వాచ్ పేరుతో రిలీజ్ చేసిన ఈవాచ్‌లో ఎన్నో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. నాయిస్ ఫ్యూజ్ స్మార్ట్ వాచ్ ధరతో పాటు ఫీచర్లు ఏంటో ఓ లుక్కేద్దాం.
నాయిస్ ఫ్యూజ్ స్మార్ట్‌వాచ్ అంతర్నిర్మిత ఉత్పాదకత సూట్‌తో వస్తుంది. అలాగే ఈ వాచ్ ఒక ఛార్జ్‌పై గరిష్టంగా 7 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను అందజేస్తుంది. అలాగే ఈ స్మార్ట్ వాచ్ 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లను అందిస్తుంది. ముఖ్యంగా నాయిస్ ఫిట్ యాప్ సపోర్ట్ కూడా ఈ యాప్‌కు అందనుంది. నాయిస్ ఫిట్ ఫ్యూజ్ స్మార్ట్ వాచ్ ధరను రూ. 1,499గా నిర్ణయించారు. ఈ స్మార్ట్‌వాచ్‌ని ఫ్లిప్‌కార్ట్‌తో పాటు నాయిస్ అఫిషియల్ వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఈ వాచ్ జెట్ బ్లాక్, రోజ్ పింక్, సిల్వర్ గ్రే, వింటేజ్ బ్రౌన్, ఫారెస్ట్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌వాచ్ గురించి నాయిస్ సహ వ్యవస్థాపకుడు అమిత్ ఖత్రి మాట్లాడుతూ “నాయిస్‌లో మేము ఎల్లప్పుడూ ప్రజలు ఇష్టపడే కొత్త మరియు మెరుగైన వస్తువులను రూపొందించడానికి ప్రయత్నిస్తాం. మా కొత్త స్మార్ట్‌వాచ్ నాయిస్ ఫిట్ ఫ్యూజ్ ఫిట్‌గా, యాక్టివ్‌గా ఉండటానికి సహాయక పరికరంగా ఉపయోగపడుతతుంది. ముఖ్యంగా నాయిస్ కంపెనీ ప్రజల జీవితాలను మెరుగుపరిచే సాంకేతికతను తయారు చేస్తూనే ఉంటుంది’’ అని పేర్కొన్నారు.
నాయిస్ ఫిట్ ఫ్యూజ్ ఫీచర్లు
నాయిస్ ఫిట్ ఫ్యూజ్ వాచ్ మెటాలిక్ ఫినిషింగ్‌తో పాటు టెక్స్‌చర్డ్ స్ట్రాప్‌తో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ 240×240 పిక్సెల్ రిజల్యూషన్‌తో 1.38-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. డిస్‌ప్లే గరిష్ట ప్రకాశాన్ని 550 నిట్‌ల వరకు అందిస్తుంది.నాయిస్‌ఫిట్ ఫ్యూజ్ బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్‌తో వస్తుంది అంటే వినియోగదారులు నేరుగా ఈ వాచ్‌ను ఉపయోగించి కాల్స్ చేయవచ్చు. అలాగే కాల్ లాగ్‌లను యాక్సెస్ చేయవచ్చు. ముఖ్యంగా ఈ స్మార్ట్‌వాచ్‌లో గరిష్టంగా 10 కాంటాక్ట్స్‌ను కూడా సేవ్ చేయవచ్చు. నాయిస్ ఫిట్ ఫ్యూజ్ స్మార్ట్‌వాచ్ 100 ప్లస్ వాచ్ ఫేస్‌లతో పాటు 100 స్పోర్ట్స్ మోడ్‌లతో వస్తుంది. హృదయ స్పందన సెన్సార్, ఎస్పీఓ 2 మానిటర్‌తో కూడా వస్తుంది. ముఖ్యంగా ఇది ఒత్తిడితో పాటు స్త్రీ ఆరోగ్య రుతు చక్రాన్ని కూడా ట్రాక్ చేస్తుంది. ఈ వాచ్ ఐపీ 68 రేటింగ్‌తో నీరు, దుమ్ము-నిరోధకతతో ఉంటుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..