చరిత్రలోనే మొదటిసారి.. ఆత్మ విశ్వాసమే ఆమె బలంగా.. మేకప్ లేకుండానే అందాల పోటీల్లో సహజ సౌందర్యం..
Miss England: అందాల పోటీల్లో పాల్గొనవారే మేకప్‌తో పాల్గొంటారనే విషయం తెలిసిందే. అలా ఫుల్ మేకప్‌తో అందంగా రడీ అవుతేనే కిరీటాన్ని సొంతం చేసుకోగలుగుతారనే భావన అందరిలోనూ ఉంది. అయితే అలా కాకుండా..

Miss England: అందాల పోటీల్లో పాల్గొనవారే మేకప్‌తో పాల్గొంటారనే విషయం తెలిసిందే. అలా ఫుల్ మేకప్‌తో అందంగా రడీ అవుతేనే కిరీటాన్ని సొంతం చేసుకోగలుగుతారనే భావన అందరిలోనూ ఉంది. అయితే అలా కాకుండా ఎలాంటి మేకప్ లేకుండా సహజ అందంతో పోటీల్లో పాల్గొంటే ఎలా ఉంటుంది.? అది అసాధ్యం అంటారా.? అయితే దీనిని నిజం చేసి చూపించిందీ ఓ మోడల్. ఎలాంటి మేకప్ లేకుండా సహజ అందంతో మిస్ ఇంగ్లండ్ పోటీల్లో ఫైనల్‌కు చేసుకొని సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. ఇంతకీ ఎవరీ మోడల్.? మేకప్ లేకుండా పోటీల్లో పాల్గొనడానికి అసలు కారణమేంటన్న విశేషాలు తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
లండన్‌కు చెందిన 20 ఏళ్ల మెడల్ మెలిస్సా రవూఫ్ ఇటీవల జరిగిన మిస్ ఇంగ్లండ్ పోటీల్లో ఫైనలిస్ట్‌గా చేరింది. అయితే ఆమె ఈ పోటీకి ఎలాంటి మేకప్ లేకుండానే స్టేజ్‌పైకి వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 94 ఏళ్ల అందాల పోటీ చరిత్రలో ఇలా సహజ సౌందర్యంతో ఫైనల్స్‌కు చేరిన తొలి మోడల్‌గా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. పొలిటిక్ సైన్స్‌ను అభ్యసిస్తున్న మెలిస్సా అందాల పోటీలో ఫైనల్‌కు చేరడంపై స్పందించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువతులు తమ సహజ సౌందర్యం పట్ల ఎలాంటి ఆత్మనూన్యత భావం లేకుండా ఉండాలనే సందేశాన్ని ఇవ్వడానికే ఇలా మేకప్ లేకుండా పోటీలో పాల్గొన్నాను అని తెలిపింది.



View this post on Instagram
మిస్ ఇంగ్లండ్ కిరీటం కోసం జరిగిన ఈ పోటీల్లో ఆగస్టు 22వ తేదీన జరిగిన సెమీ ఫైనల్ రౌండ్‌లో మేకప్ లేకుండా ప్రవేశించి న్యాయనిర్ణేతలను ఆకట్టుకుంది. నిజమైన అందం సింప్లిసిటీలో ఉందని తెలిపిన మెలిస్సా.. నిత్యం నవ్వుతూ సంతోషంగా ఉంటే వారు తమ ముఖాన్ని మేకప్‌తో కప్పుకోవాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చింది. వచ్చే నెలలో జరగనున్న ఫైనల్ పోటీల్లో పాల్గొననున్న మెలిస్సా కిరీటాన్ని అందుకుంటుందో చూడాలి.
View this post on Instagram
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..
