Shinzo Abe: జపాన్ మాజీ ప్రధానిని అందుకే చంపా.. కారణాలు వివరిస్తూ హంతకుడి బహిరంగ లేఖ.. ప్రజలు ఏమంటున్నారంటే..?
అతను జపాన్ ప్రజల ప్రియతమ మాజీ ప్రధానిని హత్య చేశాడు.. కానీ ఆ ప్రజలే ఇప్పుడు ఆయన మీద సానుభూతి వ్యక్తం చేస్తూ కానుకలు కూడా పంపుతున్నారు.. ఇంతలో ఎందుకంత మార్పు వచ్చింది?

Tetsuya Yamagami: హంతకులను సమాజం అసహ్యించుకుంటుంది. అందునా తమకు ఎంతో ఇష్టమైన నాయకున్ని తుద ముట్టించిన.. ఆ వ్యక్తి అంటే మరింత ఆగ్రహం సహజం.. కానీ విచిత్రంగా ఆ హంతునిపట్ల సానుభూతి పెరుగుతోంది.. జపాన్‌లో అత్యంత ప్రజాదరణ ఉన్న శక్తివంతమైన ప్రధానమంత్రిగా పేరు తెచ్చుకున్నారు షింజో అబే.. ఆగస్టు 8వ తేదీన ఓ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తున్న షింజో అబేను వెనుక నుంచి హ్యాండ్‌మేడ్ గన్‌తో కాల్చి హత్య చేశాడు ‘టెత్సుయా యమగామి’ అనే యువకుడు. స్పాట్‌లోనే యమగామిని భద్రతా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తాను ఎందుకు షింజో అబేను హత్య చేయాల్సి వచ్చిందో వివరిస్తూ ఓ లేఖ విడుదల చేశాడు యమగామి. షింజోలాంటి గొప్ప నాయకున్ని హత్య చేయడం ముమ్మాటికి తప్పేనని నేరాన్ని అంగీకరించాడు. ఇందుకు తనను కఠినంగా శిక్షించాల్సిందే తెలిపారు. తన తల్లి ఆస్తులన్నింటీనీ అమ్మి ఒక మత సంస్థకు భారీగా విరాళాలు ఇవ్వడంతో తమ కుటుంబ ఆర్థికంగా చితికి పోయిందంటున్నాడు యమగామి. భవిష్యత్తుపై అభద్రతతో మన సోదరుడు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. షింజో అబే ఆ మత సంస్థకు అండగా నిలవడం తనకు ఆగ్రహం తెప్పించిందంటూ యమగామి పేర్కొన్నాడు.
జపాన్‌లో కొంత కాలంగా ఎంతో మంది యువత నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారు. వీరందరినీ యమగామి లేఖ కదిలించింది. ఆయన పట్ల సానుభూతి తెలుపుతూ జైలుకు కానుకలు పంపుతున్నారు. యమగామి తన వాదన విపించే అవకాశం ఇవ్వాలంటూ ఏడు వేల మంది ఒక ఒక లేఖపై సంతకాలు చేసి కోర్టుకు పిటిషన్ రూపంలో పంపారు. అయితే యమగామి ఈ హత్య చేయకుండా తన ఆవేదన సమాజానికి తెలియజేసి ఉంటే మరింత ఎక్కువ సానుభూతి లభించేదంటటూ జపాన్ ప్రజలు పేర్కొంటున్నారు.
కాగా.. జపాన్ ప్రభుత్వం సెప్టెంబర్ 27న మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియలను (shinzo abe funeral) అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా పలు ఏర్పాట్లను సైతం చేస్తోంది. షింజో అబే అంత్యక్రియల్లో ప్రధాని మోడీతోపాటు పలు దేశాధినేతలు కూడా పాల్గొననున్నారు. టోక్యోలోని కిటానోమారు నేషనల్ గార్డెన్‌లోని నిప్పన్ బుడోకాన్ అరేనాలో ఈ వీడ్కోలు కార్యక్రమం జరగనుంది.



మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం
