AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Donald Trump: ట్రంప్‌కు బిగుస్తున్న ఉచ్చు.. ఇంటి నుంచి రహస్య పత్రాల స్వాధీనం.. వెలుగులోకి విస్తుపోయే అంశాలు..

క్యాపిటల్‌ హిల్స్‌పై దాడి కేసులో దర్యాప్తును ఎదుర్కొంటున్న ట్రంప్‌పై ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ -ఎఫ్‌బీఐ చేపట్టిన దర్యాప్తులో విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి.

Donald Trump: ట్రంప్‌కు బిగుస్తున్న ఉచ్చు.. ఇంటి నుంచి రహస్య పత్రాల స్వాధీనం.. వెలుగులోకి విస్తుపోయే అంశాలు..
Donald Trump
Shaik Madar Saheb
|

Updated on: Aug 28, 2022 | 7:26 AM

Share

Donald Trump: 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమవుతున్న డొనాల్డ్‌ ట్రంప్‌ పీకల్లోతు కష్టాల్లోకి జారుకుంటున్నారు.. అమెరికా అధ్యక్షుని వ్యవహరించిన సమయంలో ఆయన చేసిన నిర్వాకాలు క్రమంగా బయటపడుతున్నాయి. క్యాపిటల్‌ హిల్స్‌పై దాడి కేసులో దర్యాప్తును ఎదుర్కొంటున్న ట్రంప్‌పై ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ -ఎఫ్‌బీఐ చేపట్టిన దర్యాప్తులో విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి. ఇటీవల ఎఫ్‌బీఐ అధికారులు ఫ్లోరిడాలోని పామ్ బీచ్​లో ఉన్న ట్రంప్‌ నివాసం మార్-ఎ-లాగో భవనంలో సోదాలు జరిపారు. ఈ తనిఖీల్లో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఆ ఇంటిలో దేశానికి చెందిన కీలక పత్రాలు దొరికాయి. ఇవన్నీ అక్కడి వార్తా పత్రికలు, మ్యాగజైన్లలో దాచి పెట్టారని ఎఫ్‌బీఐ తన అఫిడవిట్‌లో తెలిపింది. 15 బాక్సుల్లో ఈ పత్రాలు దొరికాయి. ఇందులో 67 విశ్వసనీయ, 92 రహస్య, 25 అత్యంత రహస్య పత్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పత్రాలన్నీ ట్రంప్‌ అధ్యక్షునిగా ఉన్న సమయంలో ఇక్కడికి తరలించాని భావిస్తున్నారు. కాగా ట్రంప్‌ వైట్‌హౌస్‌ ఖాళీ చేసే సమయంలో హడావుడిగా తీసుకొచ్చిన పత్రాల్లో ఇవన్నీ ఉన్నాయని ఆయన కొడుకు చెబుతున్నాయి. ఈ పత్రాలను ట్రంప్‌ తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేయాల్సి ఉన్నా, ఎందుకు ఇవ్వలేదని ఎఫ్‌బీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

ఇటీవల ఫ్లోరిడాలోని తన నివాసంపై ఎఫ్‌బీఐ అధికారులు సోదాలు చేపట్టినప్పుడు బైడెన్‌ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేశారు ట్రంప్‌.. వచ్చే ఎన్నికల్లో తాను మళ్లీ పోటీ చేయకుండా అడ్డుకునేందుకే డెమోక్రాట్లు ఈ కుట్రలు పన్నారని ఆరోపించారు. ఇదంతా రాజకీయ కక్షసాధింపని ఆరోపించారు. గతంతో ఏ మాజీ అధ్యక్షుని నివాసంతో తనిఖీలు జరగలేదని, తన ఇంటిలో జరపాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు ట్రంప్‌.. అమెరికాలో మిట్‌టర్మ్‌ ఎన్నికల సమయంలో ఈ తనిఖీలు రాజకీయాంశంగా మారిపోయాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం 

నడుము డిస్క్ సమస్యలకు ఆధునిక వైద్యం
నడుము డిస్క్ సమస్యలకు ఆధునిక వైద్యం
బిగ్ బాష్ లీగ్‌లో తప్పిన పెను ప్రమాదం..వీడియో వైరల్!
బిగ్ బాష్ లీగ్‌లో తప్పిన పెను ప్రమాదం..వీడియో వైరల్!
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా