AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దారుణం.. తప్పతాగి బారుకు నిప్పు పెట్టాడు.. చివరికి

మెక్సికోలోని మద్యం మత్తులో ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. అతడు చేసిన పనికి ఏకంగా 11 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే సోనోరా రాష్ట్రంలోని శాన్ లుయిస్ రియో కొలరాడోలో ఓ వ్యక్తి మద్యం తాగేందుకు బార్‌కు వెళ్లాడు.

దారుణం.. తప్పతాగి బారుకు నిప్పు పెట్టాడు.. చివరికి
Fire
Aravind B
|

Updated on: Jul 23, 2023 | 3:58 PM

Share

మెక్సికోలోని మద్యం మత్తులో ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. అతడు చేసిన పనికి ఏకంగా 11 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే సోనోరా రాష్ట్రంలోని శాన్ లుయిస్ రియో కొలరాడోలో ఓ వ్యక్తి మద్యం తాగేందుకు బార్‌కు వెళ్లాడు. అక్కడ పీకల దాకా మద్యం తాగాక బార్‌లో ఉన్న మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బార్ సిబ్బంది అతడ్ని బయటకు పంపించేశారు. ఈ క్రమంలోనే సెక్యూరిటీతో అతడికి గొడవ జరిగింది. అయితే బయటకు వచ్చిన ఆ వ్యక్తి కొద్దిసేపటి తర్వాత ఓ పెట్రోల్ బాంబు తీసుకొచ్చి.. ఆ బార్‌పై దాడి చేశాడు.

దీంతో ఒక్కసారిగా బార్‌లో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. లోపల ఉన్నవారు హాహాకారలు పెట్టారు. బార్ నుంచి బయటకు వెళ్లేందుకు కూడా ఒక్కటే దారి ఉండటంతో కొందరు లోపలే చిక్కుకుపోయారు. అయితే ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మహిళలు ఆరుగురు కాగా.. 5 గురు పురుషులు. అలాగే మరికొందరు కూడా గాయాలపాలయ్యారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పేశారు. నిందుతుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.

Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!