అయ్యో పాపం.. పదేళ్ల చిన్నారికి కదలలేని వింతవ్యాధి.. ప్రపంచ దేశాల్లో దొరకని చికిత్స..?

| Edited By: TV9 Telugu

Jul 13, 2023 | 7:18 PM

ఆస్ట్రేలియాలోని 10 ఏళ్ల బాలిక అరుదైన వ్యాధితో బాధపడుతోంది. దీని కారణంగా ఆమె కాలు కదిపితే భరించలేని భాదతో అవస్థపడుతుంది. అంతేకాదు.. పొరపాటున ఎవరైనా తన కాలిని తాకినా కూడా తనకు ప్రాణం పోయేంత నొప్పి కలుగుతుంది.

అయ్యో పాపం.. పదేళ్ల చిన్నారికి కదలలేని వింతవ్యాధి.. ప్రపంచ దేశాల్లో దొరకని చికిత్స..?
Most Painful Condition
Follow us on

ఆస్ట్రేలియాలోని 10 ఏళ్ల బాలిక అరుదైన వ్యాధితో బాధపడుతోంది. దీని కారణంగా ఆమె కాలు కదిపితే భరించలేని భాదతో అవస్థపడుతుంది. అంతేకాదు.. పొరపాటున ఎవరైనా తన కాలిని తాకినా కూడా తనకు ప్రాణం పోయేంత నొప్పి కలుగుతుంది. బెల్లా మాసీ అనే అమ్మాయి ఇలాంటి విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది. బెల్లా ఫిజీలో తన కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లినప్పుడు..ఆమె కుడి పాదంలో ఉన్నట్టుండి పొక్కులాంటిది ఏర్పడింది. దాంతో ఆమెకు ఇలాంటి అరుదైన వ్యాధి సోకింది. అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న ఆ చిన్నారిని.. ఆస్పత్రికి తీసుకు వెళ్లగా వైద్యులు.. ఆమెకు కాంప్లెక్స్ రీజనల్ పెయిన్ సిండ్రోమ్ (CRPS) ఉన్నట్లు నిర్ధారించారు.

ఇక, “రోగనిర్ధారణ చేసినప్పటి నుండి బాలిక పరిస్థితి మరింత దిగజారింది. అప్పటి నుంచి మరింత విపరీతమైన నొప్పితో పోరాడుతోంది. అది ఆమె రోజువారీ కార్యకలాపాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఆ చిన్నారి తన బాల్యానికి దూరమైంది. బెల్లా భరించలేని నొప్పితో ఆమె కుడి కాలులో చలనశీలత కోల్పోయింది. కాళ్ళు, ఆమె గజ్జల వరకు స్పర్శ లేకుండా పోయింది. ఆమె ఇప్పుడు మంచానికే పరిమితం అయింది. మంచం దిగి కదలాలంటే..వీల్‌చైర్ అవసరం. CRPS అనేది దీర్ఘకాలిక, తీవ్రమైన నొప్పిని కలిగించే అరుదైన, నయం చేయలేని సిండ్రోమ్. ఈ వ్యాధి లక్షణాల్లో తీవ్రమైన నొప్పి..మంట, జలదరింపుగా ఉంటుంది. “నేను స్నానం చేయలేను, నా కుడి కాలుతో చిన్న టిష్యూను తాకలేను.. పొరపాటున తగిలితే..ఆ నొప్పిన భరించలేక గట్టిగా అరుస్తాను,” అంటూ బెల్లా కన్నీరు పెట్టుకుంది.

చిన్నపాటి గాయాలు లేదా సర్జరీల వల్ల తరచుగా సంభవించే అరుదైన పరిస్థితి ఇప్పుడు బెల్లా జీవితాన్ని స్తంభింపజేసింది. 10 ఏళ్ల చిన్నారి కదలలేదు, కుడి కాలు, పాదంలో స్పర్శ లేదు. కానీ, ఏ కొంచం తాకినా కూడా నొప్పిని భరించలేదు. స్కూల్‌కి వెళ్లడం, స్నేహితులతో ఆడుకోవడం, ప్యాంట్‌లు వేసుకోవడం కుదరదు. బెల్లా కుటుంబం ఆస్ట్రేలియా మొత్తంలో ఈ అరుదైన వ్యాధికి చికిత్సను అందించలేకపోయారు. కాబట్టి వారు సహాయం కోసం అమెరికన్ వైద్యులను ఆశ్రయించారు. బెల్లా, ఆమె తల్లి స్పెరో క్లినిక్‌లో చికిత్స పొందేందుకు US వెళ్లారని తెలిసింది. కానీ, వారికి సరైన చికిత్స అందుబాటులో ఉన్నది లేనిది ఖచ్చితంగా తెలియదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..