AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బొగ్గు గనిలో పేలుడు.. 10 మంది మైనర్లు మృతి.. పలువురికి తీవ్ర గాయాలు..

ఇండోనేషియాలో విషాదం చోటు చేసుకుంది. ఓ బొగ్గు గనిలో సంభవించిన పేలుడు ఘటనలో పది మంది కార్మికులు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం ఇండోనేషియాలోని వెస్ట్ సుమత్ర ఫ్రావిన్స్ లో జరిగింది. చనిపోయిన వారంతా మైనర్లుగా..

బొగ్గు గనిలో పేలుడు.. 10 మంది మైనర్లు మృతి.. పలువురికి తీవ్ర గాయాలు..
Coal Mine Explosion
Amarnadh Daneti
|

Updated on: Dec 09, 2022 | 9:58 PM

Share

ఇండోనేషియాలో విషాదం చోటు చేసుకుంది. ఓ బొగ్గు గనిలో సంభవించిన పేలుడు ఘటనలో పది మంది కార్మికులు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం ఇండోనేషియాలోని వెస్ట్ సుమత్ర ఫ్రావిన్స్ లో జరిగింది. చనిపోయిన వారంతా మైనర్లుగా తెలుస్తోంది. మిథేన్ గ్యాస్ లీక్ అవ్వటంతోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో పది మంది మృతదేహాలను గుర్తించారు అధికారులు. మరో నలుగురికి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఖనిజాలు అధికంగా ఉన్న ఆగ్నేయాసియా ద్వీపసమూహంలో మైనింగ్ ప్రమాదాలు సర్వసాధారణంగా జరుగుతుంటాయి. ప్రత్యేకించి సరైన భద్రతా పరికరాలను ఉపయోగించకుండా ఉండటమే ఈ ప్రమాదాలకు కారణంగా తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ లో బోర్నియో ద్వీపంలో జరిగిన పేలుడు ఘటనలోనూ ఏడుగురు మృతి చెందారు. ఏప్రిల్ లోనూ ఉత్తర సమత్రా ఫ్రావిన్స్‌లో బంగారు గనిలో పేలుడు సంభవించి 12 మంది దుర్మరణం చెందారు.

ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు ఇద్దరిని రక్షించి.. తక్షణ చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించాయి. మైనింగ్​ జరుపుతుండగా మీథేన్ వాయువు పెద్దమొత్తంలో విడుదల అవడంతోనే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు అధికారులు.

బ్లోయర్ల సహాయంతో గని నుంచి మీథేన్​ను తొలగిస్తున్నట్లు వెల్లడించారు. ప్రమాద సమయంలో మొత్తం 14మంది కార్మికులు గనిలోపల ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..

Follow Us
శ్రీ వాసవీ మాతకు 102 ఋషి గోత్ర నామాలతో భారీ రుద్రాక్ష మాల సమర్పణ
శ్రీ వాసవీ మాతకు 102 ఋషి గోత్ర నామాలతో భారీ రుద్రాక్ష మాల సమర్పణ
రెండు కళ్లు చాలవు.. ఈ అందమైన పూలను మీరెక్కడైనా చూశారా?
రెండు కళ్లు చాలవు.. ఈ అందమైన పూలను మీరెక్కడైనా చూశారా?
కొబ్బరి నీళ్లను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?ఎక్స్‌పైర్ అవుతాయని తెలుసా
కొబ్బరి నీళ్లను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?ఎక్స్‌పైర్ అవుతాయని తెలుసా
కోహ్లీ కంటే తోపుగాడు.. 19 ఏళ్లకే ప్రపంచ రికార్డ్.. కట్‌చేస్తే..
కోహ్లీ కంటే తోపుగాడు.. 19 ఏళ్లకే ప్రపంచ రికార్డ్.. కట్‌చేస్తే..
చీకటి పడ్డాక ఇల్లు శుభ్రం చేయకూడదంటారు ఎందుకు? అసలు కారణం ఇదే
చీకటి పడ్డాక ఇల్లు శుభ్రం చేయకూడదంటారు ఎందుకు? అసలు కారణం ఇదే
ఉద్యోగులకు శుభవార్త అందించిన తెలంగాణ ప్రభుత్వం
ఉద్యోగులకు శుభవార్త అందించిన తెలంగాణ ప్రభుత్వం
తులం బంగారం అమ్మితే షాపు యజమానికి ఎంత లాభమంటే..?
తులం బంగారం అమ్మితే షాపు యజమానికి ఎంత లాభమంటే..?
తెలంగాణలో పెట్రోల్, డీజిల్ సరఫరాపనై కీలక అప్‌డేట్
తెలంగాణలో పెట్రోల్, డీజిల్ సరఫరాపనై కీలక అప్‌డేట్
Buggottsavam: గోవిందరాజస్వామి బుగ్గోత్సవం వెనుక దాగిన రహస్యం ఏంటో
Buggottsavam: గోవిందరాజస్వామి బుగ్గోత్సవం వెనుక దాగిన రహస్యం ఏంటో
ఈ టాలీవుడ్ యాంకరమ్మకు హైదరాబాద్‌లో 20 కోట్ల లగ్జరీ విల్లా ఉందా?
ఈ టాలీవుడ్ యాంకరమ్మకు హైదరాబాద్‌లో 20 కోట్ల లగ్జరీ విల్లా ఉందా?