Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

American Hijab: హిజాబ్‌ తొలగించారు.. 17.5 మిలియన్ల పరిహారం చెల్లించారు.!

American Hijab: హిజాబ్‌ తొలగించారు.. 17.5 మిలియన్ల పరిహారం చెల్లించారు.!

Anil kumar poka

|

Updated on: Apr 08, 2024 | 9:51 AM

నేరస్థులకూ హక్కులు ఉంటాయని.. వాటిని అతిక్రమిస్తే పోలీసులైనా సరే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని నిరూపించే సంఘటన అమెరికాలోని న్యూయార్క్ లో జరిగింది. 2018లో జరిగిన ఈ ఘటనపై పోలీసులు తాజాగా రాజీకి వచ్చారు. బాధితులకు పరిహారం చెల్లించి కోర్టు బయట సెటిల్ చేసుకునేందుకు అంగీకరించారు. ఇందుకు గానూ భారీ మొత్తం.. 17.5 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు అంగీకరించారు.

నేరస్థులకూ హక్కులు ఉంటాయని.. వాటిని అతిక్రమిస్తే పోలీసులైనా సరే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని నిరూపించే సంఘటన అమెరికాలోని న్యూయార్క్ లో జరిగింది. 2018లో జరిగిన ఈ ఘటనపై పోలీసులు తాజాగా రాజీకి వచ్చారు. బాధితులకు పరిహారం చెల్లించి కోర్టు బయట సెటిల్ చేసుకునేందుకు అంగీకరించారు. ఇందుకు గానూ భారీ మొత్తం.. 17.5 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు అంగీకరించారు. మన రూపాయల్లో ఇది సుమారు 146 కోట్లు.. ఇదే సమస్యను ఎదుర్కొన్న బాధితులు అందరికీ ఈ మొత్తాన్ని చెల్లించనున్నారు. అంతేకాదు.. బాధిత మహిళలు కోర్టుకెక్కడంతో చట్టంలోనూ మార్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

అసలు విషయానికి వస్తే 2018లో ఇద్దరు ముస్లిం మహిళలను న్యూయార్క్ పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక చట్టాలను, నిబంధనలను అతిక్రమించారనే ఆరోపణలతో వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, అవి తప్పుడు ఆరోపణలని బాధిత మహిళలు చెప్పారు. అరెస్టు చేసిన తర్వాత జైలుకు పంపే ముందు నిందితులను ఫొటో తీయడం పోలీసు విధుల్లో ఓ భాగం. దీనిని మగ్ షాట్ అంటారు. ఇందుకోసం బాధిత మహిళల హిజాబ్ ను బలవంతంగా తొలగించారు. దీంతో తాను పోలీసుల ముందు నగ్నంగా నిలుచున్నట్లు అనిపించిందంటూ ఓ బాధితురాలు మీడియా ముందు తన ఆవేదన వ్యక్తం చేసింది. కేసు విచారణ జరుగుతుండగానే న్యూయార్క్ పోలీసులపై తన లాయర్ సాయంతో కేసు పెట్టింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..