Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికాలో పెట్టేబేడా సర్దుకుంటున్న.. అక్రమంగా ఉంటున్న ప్రవాసులు!

అమెరికాలో పెట్టేబేడా సర్దుకుంటున్న.. అక్రమంగా ఉంటున్న ప్రవాసులు!

Phani CH

|

Updated on: Jan 22, 2025 | 5:25 PM

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన తర్వాత అక్కడ అక్రమంగా ఉంటున్న ప్రవాసుల్లో మొదలైన గుబులు ఆయన ప్రమాణ స్వీకారం తర్వాత మరింత ఎక్కువైంది. దీంతో గుట్టుచప్పుడు కాకుండా అమెరికాను వీడేందుకు రెడీ అవుతున్నారు. సరైన పత్రాలు లేకుండా ఇన్నాళ్లు దేశంలో ఉన్నవాళ్లంతా స్వదేశాలకు వెళ్లిపోయేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

అమెరికాలో పుట్టడంతో పౌరసత్వం పొందిన తమ పిల్లల బాధ్యతలను సంరక్షకులకు అప్పగించి పెట్టేబేడా సర్దుకుంటున్నారు. ఇలాంటి వారికి నోరా సానిడ్గో వంటి సామాజిక కార్యకర్తలు అండగా నిలుస్తున్నారు. అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. బర్త్‌ సర్టిఫికెట్లు, మెడికల్, స్కూలు రికార్డులను పిల్లల వద్ద ఉంచాలని సూచిస్తున్నారు. ప్రవాసులకు స్వర్గధామమైన షికాగోలో చొరబాటుదారులపై ఈ వారం చర్యలు తీసుకోబోతున్నారన్న వార్త అక్కడి ప్రవాసుల్లో కలకలం రేపింది. పలువురు ప్రవాసులు షికాగోలో ఇళ్లు కొనుక్కుని స్థిరపడ్డారు. ఇప్పుడు వారి పరిస్థితి ఏంటన్న దానిపై ఆందోళన నెలకొంది. మరోవైపు, దేశంలో అక్రమంగా ఉంటున్న ప్రవాసులపై చర్యలు తప్పవని ట్రంప్ మద్దతుదారులు కూడా హెచ్చరిస్తున్నారు. అక్రమంగా అమెరికాకు వలస వచ్చినవారంతా ఆయా దేశాలకు వెళ్లిపోవాల్సిందేనని అమెరికా నూతనాధ్యక్షుడు ట్రంప్‌ తన ప్రసంగంలో స్పష్టంచేశారు. సరిహద్దుల్ని తెరిచి వదిలేయడంతో లక్షల మంది ప్రజలు అమెరికాలోకి చొరబడ్డారనీ ఎలాంటి తనిఖీలు లేవు..ఏవీ లేవు అన్నారు. ఇలా వచ్చినవారిలో చాలామంది హంతకులన్నారన్నారు. ప్రపంచం ఎన్నడూ చూడనంత స్థాయిలో సరిహద్దుల్ని బలోపేతం చేస్తామన్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vijay: రైతుల పోరాటానికి.. విజయ్ మద్దతు

The Raja Saab: ఆ లీకైన వీడియో ‘రాజా సాబ్‌’ది కాదు..

Donald Trump: అమెరికా అధ్యక్షుడి టేబుల్ పై స్పెషల్ బటన్.. ఏంటది? ఎందుకు?

తండ్రి కాబోతున్న టాలీవుడ్‌ యంగ్ హీరో..

స్టార్‌కు సాయం చేసిన ఆటో డ్రైవర్‌ కు రివార్డ్‌.. ఎంత ఇచ్చారంటే..

Published on: Jan 22, 2025 04:20 PM