స్టార్‌కు సాయం చేసిన ఆటో డ్రైవర్ కు రివార్డ్.. ఎంత ఇచ్చారంటే..
బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగి వారం రోజులు కావస్తోంది. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సైఫ్ అలీఖాన్‌ను సదరు వ్యక్తి కోటి రూపాయలు డిమాండ్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈ ఘటనలో సైఫ్ అలీఖాన్‌ను ఆస్పత్రికి తరలించేందుకు ఓ ఆటో డ్రైవర్ సాయం చేశాడు.
సకాలంలో సైఫ్‌ను సేఫ్ గా ఆస్పత్రికి చేర్చి నటుడి ప్రాణాలను కాపాడడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడీ ఆటో డ్రైవర్‌కే… రివార్డు లభించింది. సైఫ్ అలీఖాన్‌పై నిందితుడు కత్తితో దాడి చేశాడు. ఈ సమయంలో సైఫ్ కుటుంబ సభ్యులు ఆయనను ఓ ఆటో డ్రైవర్ సాయంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతను షార్ట్ కట్స్ వెతుక్కుంటూ సైఫ్ ను లీలావతి ఆస్పత్రికి చేర్చాడు. తద్వారా నటుడికి సకాలంలో చికిత్స అందేలా చేశాడు. ఇలా సైఫ్ ప్రాణాలు కాపాడడంలో కీలక పాత్ర పోషించిన ఆ ఆటో డ్రైవర్ పేరు భజన్ సింగ్. తాజాగా ఈ ఆటో డ్రైవర్ కు ముంబయిలోని ఓ సంస్థ 11 వేల రూపాయల రివార్డు ఇచ్చి సత్కరించింది. ఈ రివార్డ్ విలువ తక్కువే అయినా.. ఓ సంస్థ ఇలా ముందుకు వచ్చి స్టార్ ను ఆదుకున్న ఆటో డ్రైవర్‌ను ప్రొత్సహించడం ఇప్పుడు నెట్టింట హాట్ డిస్కషన్‌గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సింధు నదిలో టన్నుల కొద్దీ బంగారం.. పాక్ దశ తిరగనుందా ??
Akhanda 2: అఘోరాల మధ్య అఖండ -2 “తాండవం” షూటింగ్
ఈ ఆకులను చీప్‌గా చూడకండి.. నాలుగు ఆకులు తిన్నారంటే రోగాలన్నీ పరార్
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

