Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గోల్డ్‌కార్డ్‌ ఫస్ట్ లుక్‌ విడుదల చేసిన ట్రంప్‌.. వీడియో

గోల్డ్‌కార్డ్‌ ఫస్ట్ లుక్‌ విడుదల చేసిన ట్రంప్‌.. వీడియో

Samatha J

|

Updated on: Apr 08, 2025 | 4:02 PM

గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికా పౌరసత్వం ఉన్నట్టు కాదని ఇప్పటికే ట్రంప్ సర్కారు స్పష్టం చేసింది. ఇదే సమయంలో అమెరికా పౌరసత్వం పొందాలనుకునే సంపన్నుల కోసం ట్రంప్ గోల్డ్ కార్డును తీసుకొచ్చారు. 5 మిలియన్ డాలర్లు చెల్లించి ఎవరైనా ఈ కార్డును కొనుగోలు చేయవచ్చు. ఈ కార్డు కొన్న వారికి అమెరికా పౌరసత్వం లభిస్తుంది. ముఖ్యంగా రష్యా, భారత్ కు చెందిన సంపన్నులు ఈ కార్డులను భారీ సంఖ్యలో కొనుగోలు చేయవచ్చనే అంచనాలు ఉన్నాయి.

 తాజాగా ట్రంప్‌ గోల్డ్‌ కార్డ్‌ ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో విలేకరులతో మాట్లాడే సమయంలో ఆయన గోల్డ్‌ కార్డ్‌ కు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను చూపించారు. ట్రంప్ ముఖచిత్రంతో ఉన్న ఈ కార్డుపై ట్రంప్ కార్డ్ అని రాసి ఉంది. అంతేకాదు ట్రంప్ సంతకం కూడా కార్డుపై ఉంది. అమెరికా అధ్యక్షుడి అధికార విమానం ఎయిర్ ఫోర్స్ వన్ లో గోల్డ్ కార్డును చూపిస్తూ.. ఈ కార్డును 5 మిలియన్ డాలర్లతో ఎవరైనా కొనుగోలు చేయవచ్చని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. తొలి కార్డును తానే కొనుగోలు చేశానని… రెండో కార్డును ఎవరు కొంటారో తెలియదని చెప్పారు. ఈ కార్డును ట్రంప్ కార్డుగా ఆయన అభివర్ణించారు. రెండు వారాల్లోగా ఈ కార్డు అందరికీ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఈబీ-5 వీసా విధానాన్ని రద్దు చేసి రూ.43.5 కోట్లు అంటే 50 లక్షల డాలర్లు వెచ్చించేవారికి ఈ గోల్డ్‌ కార్డు అందిస్తామని ఇటీవల ట్రంప్‌ ప్రకటించారు. దీన్ని కొనుగోలు చేసినవారికి నేరుగా అమెరికా పౌరసత్వాన్ని అందజేస్తారు. ప్రపంచవ్యాప్తంగా సంపన్నులను ఆకర్షించేందుకే దీనిని ప్రవేశపెట్టామని, వారు అమెరికాకు వచ్చి భారీగా ఖర్చు పెడితే స్థానికంగా ఉద్యోగాలు పెరుగుతాయని ట్రంప్‌ తెలిపారు. ఈ కార్డుకు భారీగా గిరాకీ వచ్చిందని, ఒక్కరోజే 1000 కార్డులను విక్రయించినట్లు వాణిజ్యశాఖ మంత్రి హోవర్డ్‌ లుట్నిక్‌ ఇటీవల తెలిపారు. వీటిద్వారా 5 బిలియన్‌ డాలర్లు సేకరించామని చెప్పారు.

మరిన్ని వీడియోల కోసం

సింహంతో బాలుడి పరాచకాలు.. వీడియో

భూదేవి చెప్పిందంటూ.. సజీవ సమాధికి యత్నించిన వ్యక్తి చివరికి వీడియో

పర్యాటకులకు కనిపించిన అద్భుతం.. పులి ఏం చేసిందంటే?

కుంభమేళా మోనాలిసాకు షాక్..డైరెక్టర్ అరెస్ట్ తో అయోయమంలో బ్యూటీ