వైట్‌హౌస్‌లో మస్క్ కోసం ఆఫీస్.. క్లారిటీ ఇచ్చిన ట్రంప్
మస్క్ ఆదేశిస్తే ట్రంప్ పాటిస్తారనే ఆరోపణలు వినిపిస్తున్న వేళ ఆయన నిర్ణయాలు అందుకు మరింత ఊతమిస్తున్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయానికి ఎలాన్ మస్క్ ఎంతో కృషి చేశారు. స్వయంగా ప్రచారం చేయడమే కాకుండా.. భారీ విరాళం సైతం ఇచ్చారు. దాంతో ట్రంప్ తన కార్యవర్గంలో ప్రత్యేక స్థానాన్ని కల్పించారు ఈ ప్రపంచకుబేరుడికి.
తాజాగా వౌట్ హౌస్‌లో ఓ ప్రత్యేక ఆఫీసును ఏర్పాటు చేసి, మస్క్‌ను ట్రంప్ తన పక్కనే కూర్చోబెట్టుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన డొనాల్డ్ ట్రంప్ ఆ వార్తలను ఖండించారు. వైట్‌హౌస్ లో టెస్లా అధినేత మస్క్ కు కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వస్తున్న వార్తలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. మస్క్ నేతృత్వంలో పని చేస్తున్న డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీకి ఓ ఆఫీసును ఏర్పాటు చేస్తున్నామని, అయితే అది వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీసులో కాదని స్పష్టం చేశారు. వైట్‌హౌస్‌లోని పశ్చిమవైపు ఉన్న ఓవల్ ఆఫీస్‌లో మస్క్‌కు ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు. అధ్యక్ష కార్యాలయంలోని పశ్చిమ భాగంలో ఏర్పాటు చేస్తున్న ఆఫీస్ ప్రభుత్వానికి చెందిన వివిధ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను చర్చించడం కోసం సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. తన బృందంలో దాదాపు 25 మంది ఉన్నందున ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల అమలు, సలహాలు, సూచనలు మొదలైన విషయాలను వారితో చర్చించేందుకు అనుగుణంగా ఈ ప్రత్యేక ఆఫీస్ ఏర్పాటు చేస్తున్నామని ట్రంప్ తెలియజేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పది రోజుల్లో రూ.10 కోట్లు..? మోనాలిసా నక్కతోక తొక్కిందా
ట్రంప్ ఇచ్చిన షాక్‌తో..ఇండియన్స్ విలవిల.. ఇకపై ఉద్యోగాలు బంద్..!
కుంభమేళాలో తొక్కిసలాట.. ఎంతమంది చనిపోయారంటే