నుమాయిష్‌లో సీక్రెట్‌గా షాపింగ్ స్టార్ నటి క్రేజీ థింగ్
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహిస్తోన్న నుమాయిష్ కు మంచి స్పందన వస్తోంది. జనవరి 03 నుంచి ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 15 వరకు అంటే సుమారు 44 రోజుల పాటు జరగనుంది. ఈసారి ఏకంగ 2500 స్టాల్స్ ఏర్పాటు చేశారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దీంతో నుమాయిష్ ను తిలకించేందుకు జనాలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
వేలాది సంఖ్యలో ఏర్పాటు చేసిన స్టాల్స్ లో తమకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. నుమాయిష్ కు వచ్చే వారిలో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఉన్నారు. అలా తాజాగా టాలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ నటి కమ్ స్టార్ యాంకర్ నుమాయిష్ ఎగ్జిబిషన్ లో సందడి చేసింది. సామాన్యులతో కలిసి పోయి షాపింగ్ చేసింది. తనకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేసింది. అలాగే టేస్టీ ఫుడ్ ఐటమ్స్ ను రుచి చూసింది. అయితే ఎవరూ తనను గుర్తు పట్టకుండా ముఖానికి మాస్క్, తలకు క్యాప్ ను ధరించింది అందాల తార. దీంతో ఈ ముద్దుగుమ్మను అసలు గుర్తుపట్టలేకపోయారు. ఆమె మరెవరో కాదు అనసూయ భరద్వాజ్. సినిమాలు, టీవీ షోలతో బిజి బిజీగా ఉండే నటి అనసూయ తాజాగా నుమాయిష్ ఎగ్జిబిషన్ కు వెళ్లింది. తన కుమారుడితో కలిసి ఎగ్జిబిషన్ లో సందడి చేసింది. అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ లో తనకు ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేసింది. అలాగే మిర్చీ బజ్జీ లాంటి టేస్టీ ఫుడ్ ఐటమ్స్ ను రుచి చూసింది. షూటింగ్, గ్రిప్ టెస్ట్ వంటి గేమ్స్ ఆడుతూ ఎంజాయ్ చేసింది. మొత్తానికి సామాన్యుల్లో కలిసిపోయి ఎగ్జిబిషన్ అంతా కలియ తిరిగింది అనసూయ. అనంతరం తన నుమాయిష్ విజిట్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఇవి నెట్టింట వైరల్ గా మారాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కుంభమేళాలో ప్రకాష్‌రాజ్ పుణ్యస్నానం! మోనార్క్ రియాక్షన్
నిర్మలమ్మ బడ్జెట్ మధ్యతరగతికి ఊరటనిస్తుందా?
బిగ్ పంచ్! OTT మరింత ఆలస్యం సంక్రాంతికి వస్తున్నాం?
సరిగ్గా లెక్కేస్తే రూ.45 వేల కోట్ల ఆస్తులు.. షాకిచ్చిన స్టార్ హీరో…