విజయేంద్రప్రసాద్‌ కలం నుంచి మరో భారీ సినిమా! రాజమౌళే దర్శకత్వం వహిస్తారా?

విజయేంద్రప్రసాద్‌ కలం నుంచి మరో భారీ సినిమా! రాజమౌళే దర్శకత్వం వహిస్తారా?

Phani CH

|

Updated on: Jan 30, 2025 | 2:15 PM

దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న ఎస్ ఎస్ ఎమ్ బీ 29 వర్కింగ్‌ టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాపై ఓ వీడియోను అప్‌లోడ్ చేసిన రాజమౌళి.. సింహాన్ని బోనులో పెట్టి పాస్‌పోర్ట్ లాక్కున్నట్లు పరోక్షంగా చెప్పాడు.

అలా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైందని హింట్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే రాజమౌళి తదుపరి సినిమా గురించి ఆయన తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఓ దిమ్మతిరిగే హింట్ ఇచ్చాడు. భారతదేశంలోని అత్యుత్తమ కథా రచయితలలో విజయేంద్రప్రసాద్ ఒకరు. ఇప్పటి వరకు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా ‘స్టూడెంట్ నెం.1’ మినహా మిగిలిన అన్ని సినిమాలకు విజయేంద్రప్రసాదే కథ అందించారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన రాజమౌళి తదుపరి సినిమా గురించి చెప్పారు. విజయేంద్రప్రసాద్ సీత గురించి ఓ కథ రాసుకున్నారట. మొత్తం రామాయణాన్ని సీత కోణంలో చూపించాలన్నది ఆయన ప్రయత్నం. కోట్లాది రూపాయల బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమా తెరకెక్కించాలన్నది విజయేంద్ర ప్రసాద్ ప్లాన్ అట. అయితే ఆ సినిమాను రాజమౌళి స్వయంగా డైరెక్ట్ చేస్తారా.. లేక మరెవరైనా డైరెక్ట్ చేస్తారా అనేది ఇంకా బయటకు రాలేదు. రాజమౌళి దర్శకత్వం వహించాలంటే కనీసం నాలుగేళ్లు అయినా ఆగాల్సిందే.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పని మధ్యలో నిద్ర వస్తోందా ?? చెక్‌ పెట్టండిలా..