మహేష్ బాబు చెప్పాడు.. అనిల్ రావిపూడి పాటించాడు..!
అరుణాచలంలో ఓ డైలాగ్ ఉంటుంది కదా..! దేవుడు శాసించాడు అరుణాచలం పాటించాడు అని.. ఇప్పుడు అనిల్ రావిపూడి కూడా ఇంచుమించూ ఇదే చేసాడు. మహేష్ చెప్పినట్టుగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా తెరకెక్కించి హిట్టు కొట్టాడు. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇంతపెద్ద విజయానికి కారణం మాత్రం మహేష్ బాబు అంటున్నాడు అనిల్ రావిపూడి.
జైలర్ ను చూసిన తర్వాత అనిల్ రావిపూడిని కలిసి నువ్వెందుకు క్రైమ్ కామెడీ ట్రై చేయకూడదు అని సలహా ఇచ్చారని.. అప్పుడే తనకు ఈ ఐడియా వచ్చిందని చెప్పాడు అనిల్ రావిపూడి. మొత్తానికి సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ వెనక మహేష్ పాత్ర కూడా ఉందని పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. అంతేకాదు అనిల్ రావిపూడి ఈ విషయాన్ని రెండు రోజుల ముందర చెప్పినా.. ఇప్పుడు కూడా ఇదే విషయం నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు.. దిమ్మతిరిగే రేంజ్ వసూళ్లు వస్తున్నాయి. పెద్ద సినిమాలకు, విజువల్ వండర్స్‌కు, పాన్ ఇండియా సినిమాలకు తీసిపోని విధంగా ఈ సినిమా వసూళ్లు వస్తున్నాయి. మొదటి వారంలోనే చాలా వరకు నాన్ రాజమౌళి రికార్డులన్నింటినీ తుడిచి పెట్టేసింది సంక్రాంతికి వస్తున్నాం మూవీ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విజయేంద్రప్రసాద్ కలం నుంచి మరో భారీ సినిమా! రాజమౌళే దర్శకత్వం వహిస్తారా?
మైనర్ ప్రియుడితో ఎఫైర్..! అత్త గొంతు కోయించిన కిల్లర్ కోడలు
మద్యం మత్తులో మాస్ ఫైట్! బార్ బయట వీరంగం
అధికారం ఉందని అతి చేయకూడదు.. వన్ బై త్రీ కాఫీ ఇవ్వలేదని
ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురికి పిండం పెట్టిన తల్లిదండ్రులు
చదివింది లా.. గురుడు చేసే పని తెలిస్తే షాకే
శ్మశానం నుంచి బిర్యానీ ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడంటే..
ఇసుక మేటల నుంచి పూర్తిగా బయటకు వచ్చిన శివాలయం.. అద్భుతంగా ఉంది

