RGVకి పోలీస్‌ నోటీస్‌.. వర్మ కూల్ రియాక్షన్

RGVకి పోలీస్‌ నోటీస్‌.. వర్మ కూల్ రియాక్షన్

Phani CH

|

Updated on: Jan 30, 2025 | 3:02 PM

సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మకు ప్రకాశం జిల్లా పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 7వ తేదీన విచారణకు హాజరు కావలసిందిగా వాట్సప్ ద్వారా నోటీసులు పంపించారు. దీంతో మరోసారి తెలుగు టూ స్టేట్స్‌లో వర్మ హాట్ టాపిక్ అవుతున్నారు. గతంలో ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ కోసం చంద్రబాబు, లోకేష్‌ల ఫోటోలు మార్ఫింగ్‌ చేసి ఎక్స్ లో పెట్టిన పోస్టులు

అభ్యంతరకరంగా ఉన్నాయంటూ ప్రకాశంజిల్లా మద్దిపాడు టిడిపి నేత రామలింగం… వర్మపై ఫిర్యాదు చేశారు. ఈ కంప్లయింట్ మీద 2024 నవంబర్‌ 10న మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నవంబర్‌ 19న తొలిసారి, 25న రెండోసారి విచారణకు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చినా, వర్మ హాజరవ్వలేదు. దీంతో ఆయనను అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. అయితే తనపై పెట్టిన కేసులను కొట్టివేయాలంటూ హైకోర్టులో రిట్ వేశారు వర్మ. రిట్ పై వాదోపవాదాలు జరిగిన తరువాత ఎట్టకేలకు వర్మకు ముందస్తు బెయిల్‌ లభించింది. దీంతో పోలీసులు మళ్లీ ఇప్పుడు నోటీసులు ఇచ్చారు. ఇక ఈ క్రమంలోనే ఫిబ్రవరి 7న విచారణకు హాజరు కావలసిందిగా ఒంగోలు రూరల్ సీఐ వాట్సప్‌ ద్వారా వర్మకు నోటీసులు పంపారు. ఇక ఈ నోటీసులకు వర్మ కూడా కూల్‌గా రియాక్టయ్యారు. తాను ఫిబ్రవరి 7న తప్పుకుండా విచారణకు హాజరవుతానని వాట్సప్‌ ద్వారా రిప్లై ఇచ్చారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మహేష్ బాబు చెప్పాడు.. అనిల్ రావిపూడి పాటించాడు..!

విజయేంద్రప్రసాద్‌ కలం నుంచి మరో భారీ సినిమా! రాజమౌళే దర్శకత్వం వహిస్తారా?

పని మధ్యలో నిద్ర వస్తోందా ?? చెక్‌ పెట్టండిలా..