Johnny Master: మీ నిజస్వరూపమేంటో.. తొందర్లోనే తెలుస్తుంది! జానీ ఎమోషనల్ పోస్ట్
లైంగిక ఆరోపణల నేపథ్యంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్ అవడం, తరువాత ప్రస్తుతం బెయిలు పై విడుదలవడం జరిగాయి. తిరిగి తన సినిమాలతో బిజీగా మారాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రకరకాల పోస్ట్ లు షేర్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. నిజం తెలుస్తుంది.. న్యాయం గెలుస్తుంది అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
ఇప్పుడా పోస్ట్ తో నెట్టింట తెగ వైరల్ అవుతున్నాడు ఈయన. ఇంతకీ ఆయన తన పోస్ట్‌లో ఏం రాసుకొచ్చాడు అంటే.. “తమ సొంత లాభం కోసం కోర్టు ఆర్డర్ల పై కూడా తప్పుడు ప్రచారాలు చేసేవారిని చూస్తుంటే జాలేస్తుంది. ముందస్తుగా నాకు తెలియకుండా జరిగిన యూనియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి నేను పెట్టిన కేసుకి సంబంధించి వచ్చిన తీర్పుని మీకు అనుకూలంగా, నచ్చినట్టుగా మార్చి మరో కేసుతో ముడిపెట్టి పోస్టులు పెడుతూ ఉన్నారు. మీరేది చెప్పినా ప్రజలు నమ్ముతారనుకుంటున్నారేమో కానీ అసలు తీర్పు వివరాలు బయటకి వచ్చిన రోజున మీ నిజస్వరూపమేంటో, దేనికోసం ఈ దుష్ప్రచారం చేస్తున్నారని అందరికీ అర్థమవుతుంది. ఆ రోజు ఎంతో దూరం లేదు. న్యాయమే గెలుస్తుంది, నిజం అందరికీ తెలుస్తుంది!!” అంటూ జానీ మాస్టర్ రాసుకొచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
RGVకి పోలీస్ నోటీస్.. వర్మ కూల్ రియాక్షన్
మహేష్ బాబు చెప్పాడు.. అనిల్ రావిపూడి పాటించాడు..!
విజయేంద్రప్రసాద్ కలం నుంచి మరో భారీ సినిమా! రాజమౌళే దర్శకత్వం వహిస్తారా?