రూ.300 కోట్ల సంక్రాంతి !! హిస్టరీ క్రియేట్ చేసిన విక్టరీ వెంకటేష్
ఏ పెద్ద సినిమాలకు, పాన్ ఇండియా సినిమాలకు తీసిపోని విధంగా విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా వసూళ్లు సాధిస్తోంది. వసూళ్లలో కొత్త చరిత్రను సృష్టిస్తోంది. మొదటి వారంలోనే చాలా వరకు నాన్ రాజమౌళి రికార్డులన్నింటినీ తుడిచి పెట్టేసింది. 300 కోట్ల కలెక్షన్స్ వైపు జెట్ స్పీడ్లో దూసుకుపోతోంది.
ఇక అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా రిలీజ్ కు ముందు మంచి ఎక్స్‌పెక్టేషన్స్‌ను వచ్చేలా చేసుకుంది. ఈ సంక్రాంతికి బొమ్మ హిట్టనేలా భారీగా బిజినెస్ కూడా జరిగింది. దాన్ని కంటిన్యూ చేస్తూ.. సంక్రాంతి రోజే జనవరి 14న రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ డే నుంచే కలెక్షన్స్ వేట షురూ చేసింది. అంతేకాదు కేవలం 14 రోజుల్లోనే 140 కోట్ల షేర్ వసూలు చేసింది సంక్రాంతికి వస్తున్నాం సినిమా. రెండు వారాల్లోనే 140 కోట్ల షేర్.. 250 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇక రెండు రోజుల క్రితం 276 కోట్ల మార్క్‌ను దాటేసింది. ఇక ఇప్పుడు ఈ సినిమా 300 కోట్ల వైపు జెట్ స్పీడ్‌లో పరుగులు పెడుతోంది. ఇక ఇదే విషయాన్ని ఈ మూవీ మేకర్స్ తాజాగా తమ సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు. ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Johnny Master: మీ నిజస్వరూపమేంటో.. తొందర్లోనే తెలుస్తుంది! జానీ ఎమోషనల్ పోస్ట్
RGVకి పోలీస్ నోటీస్.. వర్మ కూల్ రియాక్షన్
మహేష్ బాబు చెప్పాడు.. అనిల్ రావిపూడి పాటించాడు..!
విజయేంద్రప్రసాద్ కలం నుంచి మరో భారీ సినిమా! రాజమౌళే దర్శకత్వం వహిస్తారా?