Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సరిగ్గా లెక్కేస్తే రూ.45 వేల కోట్ల ఆస్తులు.. షాకిచ్చిన స్టార్ హీరో...

సరిగ్గా లెక్కేస్తే రూ.45 వేల కోట్ల ఆస్తులు.. షాకిచ్చిన స్టార్ హీరో…

Phani CH

|

Updated on: Jan 29, 2025 | 3:21 PM

గతేడాది దీపావళీ కానుకగా అమరన్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన శివకార్తికేయన్.. భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పటివరకు దాదాపు 22 సినిమాల్లో నటించి మెప్పించాడు. ప్రస్తుతం ఈ స్టార్ చేతిలో మరో మూడు సినిమాలు ఉన్నట్లు సమాచారం. 2025 నాటికి మొత్తం 25 సినిమాలను పూర్తి చేయాలని శివకార్తికేయన్ భావిస్తున్నట్లు టాక్.

ఇక సినిమాల్లోనే కాదు.. ఇంటర్వ్యూల్లో కూడా తన కామెడీ పంచ్‌తో ఎంటర్‌ టైన్ చేసే ఈ హీరో.. ఇప్పుడు కూడా ఓ ఇంటర్వ్యూలో కామెడీ చేశాడు. ఎంత సంపాదించావంటూ యాంకర్ అడగగా… అంబానీ అంత అంటూ.. సెటైర్ వేశాడు. తన మాటలతో అందర్నీ నవ్వించి.. నెట్టింట తెగ వైరల్ అవుతున్నాడు. శివకార్తికేయన్ చివరి చిత్రం అమరన్‌కు దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో నటి సాయి పల్లవి కథానాయికగా నటించింది. ఈ సినిమా తర్వాత శివకార్తికేయన్ మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. ఆ తర్వాత దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌తో శివకార్తికేయన్‌ ఓ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత డైరెక్టర్ సుధా కొంగర డైరెక్షన్ లో ఓ మూవీ చేయనున్నారు. ఈ చిత్రంలో శివకార్తికేయన్‌కు విలన్‌గా ప్రముఖ నటుడు జయం రవిని ఎంపిక చేశారు. ఇక శివకార్తికేయన్ ఓ ఇంటర్వ్యూలో తన ఆస్తి విలువ గురించి మాట్లాడడం వైరల్ అవుతోంది. శివకార్తికేయన్‌ను ఆ ఇంటర్వ్యూలో మీకు ఎంత ఆస్తి ఉందని ప్రశ్నించగా.. రూ.45,000 కోట్లు ఉంటుందని.. తాను అంబాని అంటూ నవ్వుతూ ఆన్సర్ ఇచ్చారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స్టార్ హీరోయిన్‌కు క్యాన్సర్‌.. దగ్గరుండి మరీ సేవలు చేస్తున్న భర్త

Anjali: గేమ్‌ ఛేంజర్‌ రిజల్ట్‌ పై అంజలి షాకింగ్ రియాక్షన్

Daaku Maharaaj: OTTలోకి ‘డాకు మహారాజ్’! స్ట్రీమింగ్ అప్పటి నుంచే

కుంభమేళాలో అందాల మీదే కెమెరా కళ్లు.. ఇలా తయారయ్యారేంట్రా ??