స్టార్ హీరోయిన్‌కు క్యాన్సర్.. దగ్గరుండి మరీ సేవలు చేస్తున్న భర్త
బాలీవుడ్ ప్రముఖ నటి హీనా ఖాన్‌కు కొన్ని నెలల క్రితం బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆమె క్యాన్సర్ చికిత్స తీసుకుంటోంది. ఈ చికిత్స సమయంలో, ఒక వ్యక్తి హీనాకు అడుగడుగునా అండగా నిలుస్తున్నాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు హీనా ప్రియుడు రాకీ జైస్వాల్. రాకీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ భావోద్వేగ పోస్ట్ ను షేర్ చేశాడు.
దీంతో పాటు కొన్ని ఫోటోలు, వీడియోలు కూడా షేర్ చేశారు. ఇందులో రాకీ హీనాను ఎలా చూసుకుంటున్నాడో , ఆమెకు ఎలా సపోర్ట్ చేస్తున్నాడో అనేది స్పష్టంగా చూడొచ్చు. ఇక ఇది చూసిన హీనా ప్రతి స్త్రీ తన జీవితంలో ఇలాంటి మగవాడు తోడుగా ఉండాలంటూ ఎమోషనలైంది. ప్రపంచంలో తనకు తెలిసిన మంచి వ్యక్తి ఇతడే అంటూ చెప్పింది. క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌లో భాగంగా తాను గుండు చేయించుకున్నప్పుడూ అతడూ గుండు కొట్టించుకున్నాడు. తనను కంటికి రెప్పలా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. తనను వదులుకోవడానికి రాకీకి వంద కారణాలున్నప్పటికీ తనకు ఎప్పుడూ అండగా నిలుస్తున్నాడంటూ ఎమోషనల్ అయింది హీనా. అంతేకాదు రాకీ తనను నిస్వార్థంగా ప్రేమిస్తున్నాడని.. జీవితకాలమంత అనుభవాన్ని మేము ఇప్పటికే పోగు చేసుకున్నాం అంటూ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Anjali: గేమ్ ఛేంజర్ రిజల్ట్ పై అంజలి షాకింగ్ రియాక్షన్
Daaku Maharaaj: OTTలోకి ‘డాకు మహారాజ్’! స్ట్రీమింగ్ అప్పటి నుంచే