Daaku Maharaaj: OTTలోకి ‘డాకు మహారాజ్’! స్ట్రీమింగ్ అప్పటి నుంచే
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం డాకు మహారజ్. కొల్లి బాబీ దర్శకత్వంలో వచ్చిన హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలుగా నటించారు. ఊర్వశి రౌతేలా, చాందిని చౌదరి కీలక పాత్రలు పోషించారు. బాలీవుడ్ నటడు బాబీ డియోల్ విలన్ పాత్రలో ఆకట్టుకున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
150 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. బాలయ్య మార్క్ యాక్షన్, బాబీ డైరెక్షన్, తమన్ బీజీఎమ్.. డాకు మహారాజ్ సినిమాను బ్లాక్ బస్టర్ గా నిలిపాయి. ఈ సినిమాతో బాలయ్య వరుసగా నాలుగు వంద కోట్లు కొల్లగొట్టి సీనియర్ హీరోగా సరికొత్త రికార్డ్ సెట్ చేశారు. ఇటీవలే అనంతపురంలో ఈ సినిమా విజయోత్సవ వేడుక కూడా ఘనంగా నిర్వహించారు. ఇదిలా ఉంటే ఇప్పటికీ థియేటర్లో మంచి కలెక్షన్లతో రన్ అవుతుంటే మరోవైపు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. డాకు మహారాజ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి రెండో వారంలో బాలయ్య సినిమా ఓటీటీలోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫిబ్రవరి 9 నుంచి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. అయితే ప్రస్తుతానికి ఇది కేవలం రూమర్ మాత్రమే. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: