Anjali: గేమ్ ఛేంజర్ రిజల్ట్ పై అంజలి షాకింగ్ రియాక్షన్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా గేమ్ ఛేంజర్. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, తెలుగమ్మాయి అంజలి హీరోయిన్స్ గా నటించారు. తమిళ నటుడు ఎస్ జే సూర్య ప్రతినాయకుడి పాత్రలో ఆకట్టుకున్నాడు. వీరితో పాటు శ్రీకాంత్, సునీల్, రాజీవ్ కనకాల, జయరాం తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
దిల్ రాజు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా జనవరి 10న గేమ్ ఛేంజర్ సినిమా రిలీజైంది. మొదటి రోజే రూ.180 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డులు కొల్లగొట్టింది. అయితే లాంగ్ రన్ లో మాత్రం ఈ సినిమా పెద్దగా వసూళ్లు రాబట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో గేమ్ ఛేంజర్ రిజల్ట్ పై అంజలి స్పందించింది. అంజలి నటించిన మదగజరాజ జనవరి 31న రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంటోన్న ఆమె ఇలా చెప్పుకొచ్చింది. ఓ నటిగా తన పని మాత్రేమ చేస్తానని చెప్పింది. తనను నమ్మి తన పాత్రను డిజైన్ చేసినపుడు దానికి 100 శాతం న్యాయం చేయడం తన బాధ్యతని.. అక్కడితోనే తన పనైపోతుందని చెప్పింది అంజలి. తమ సినిమాను జనాలు ఆదరించాలన్నది తమ తపన అని.. అందుకోసం ప్రమోషన్స్‌కు వెళ్తుంటామంటూ అంజలి చెప్పింది. ఇక గేమ్ ఛేంజర్ చూసిన జనరల్ ఆడియన్స్ ఎవరూ కూడా సినిమా బాగోలేదని చెప్పలేదంటూ చెప్పింది అంజలి. ఒక మంచి సినిమా చూసామని తనకు చాలా మంది చెప్పారని చెప్పింది. ఒక సినిమా బాగుండటం వేరు, మంచి సినిమా అనడం వేరని.. గేమ్ ఛేంజర్ మంచి సినిమా అంటూ.. స్టేట్మెంట్ ఇచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Daaku Maharaaj: OTTలోకి ‘డాకు మహారాజ్’! స్ట్రీమింగ్ అప్పటి నుంచే
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్
కలకలం సృష్టిస్తున్న దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధింపు
దోశె పిండి !! ఇద్దరు చిన్నారుల్ని మింగేసింది
సీజన్ కాని సీజన్ లో మార్కెట్లోకి వచ్చిన పులస
మాంసం ముక్క గొంతులో ఇరుక్కొని ఊపిరి ఆగిపోయిన ఘటన
జమ్ముకశ్మీర్ లో తులిప్ గార్డెన్ కు పర్యాటకుల తాకిడి
12 నిమిషాల్లో.. కేజీ బంగారాన్ని కొట్టేశారు

