TOP 9 ET News: వారాల్లో రూ.100 కోట్ల లాభం| ఆ స్టార్ డైరెక్టర్‌తో సినిమా వద్దు.. NTRకు ఫ్యాన్స్ రిక్వెస్ట్

TOP 9 ET News: వారాల్లో రూ.100 కోట్ల లాభం| ఆ స్టార్ డైరెక్టర్‌తో సినిమా వద్దు.. NTRకు ఫ్యాన్స్ రిక్వెస్ట్

Phani CH

|

Updated on: Jan 29, 2025 | 5:34 PM

తమ హీరోకు ఓ సూపర్ డూపర్ హిట్టు పడాలనే ఫ్యాన్స్‌ కోరుకుంటూ ఉంటారు. అందుకోసం పలానా స్టార్ డైరెక్టర్‌తో సినిమాలు చేయాలని తమ హీరోను వేడుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ ఇందుకు భిన్నంగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్‌తో సినిమా చేయొద్దు అంటూ సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేస్తున్నారు.

ఆయన తీసిన బ్యాడ్ గర్ల్‌ సినిమా వివాదాస్పదమైన నేపథ్యంలో.. తారక్ ఫ్యాన్స్‌ ఇలా రిక్వెస్ట్ చేస్తున్నారు. కానీ ఇదివరకే ఎన్టీఆర్ కోలీవుడ్‌ లో జరిగిన దేవర ప్రీ రిలీజ్‌ ఈవెంట్లో వెట్రిమారన్‌తో సినిమా చేయాలని ఉందంటూ చెప్పాడు. మరి ఇప్పుడు ఫ్యాన్స్‌ రిక్వెస్ట్ కు తారక్ తలొగ్గుతాడో.. లేక తన కోరిక మేరకు వెట్రితో సినిమా చేస్తాడో చూడాలి. సంక్రాంతికి వస్తున్నాం మూవీ.. అందరి మన్ననలను అందుకుంది. కలెక్షన్స్‌ను కుప్పలు తెప్పలుగా వచ్చేలా చేసుకుంది. షాకింగ్‌లీ 300 కోట్ల వైపు జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. ఈక్రమంలోనే ఈ మూవీకి దాదాపు 2 వారాల్లో 100 కోట్ల లాభం వచ్చిందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. 72 వర్కింగ్‌ డేస్లో 50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీతో దిల్ రాజు జాక్ పాట్ కొట్టారనే కామెంట్ కూడా ఫిల్మ్ అనలిస్టుల మాటల్లో రీసౌండ్ చేస్తోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కుంభమేళాలో ప్రకాష్‌రాజ్‌ పుణ్యస్నానం! మోనార్క్‌ రియాక్షన్

నిర్మలమ్మ బడ్జెట్‌ మధ్యతరగతికి ఊరటనిస్తుందా?

బిగ్ పంచ్‌! OTT మరింత ఆలస్యం సంక్రాంతికి వస్తున్నాం?

సరిగ్గా లెక్కేస్తే రూ.45 వేల కోట్ల ఆస్తులు.. షాకిచ్చిన స్టార్ హీరో…

స్టార్ హీరోయిన్‌కు క్యాన్సర్‌.. దగ్గరుండి మరీ సేవలు చేస్తున్న భర్త