పది రోజుల్లో రూ.10 కోట్లు..? మోనాలిసా నక్కతోక తొక్కిందా
మహా కుంభమేళా వైభవంగా జరుగుతోంది. కోట్లాది మంది ప్రజలు వచ్చి పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. ఈ ఆధ్యాత్మిక ఉత్సవానికి విదేశాల నుంచి కూడా ఎంతో మంది తరలి వస్తున్నారు. ప్రత్యేక పూజలు చేస్తున్నారు. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించడాన్ని పూర్వజన్మ సుకృతం అని భావిస్తున్నారు భక్తులు.
ఈ మహా కుంభమేళాకి ఇన్ని కోట్ల మంది రావడం ఒక ఎత్తైతే..కొన్ని కోట్ల మంది దృష్టిని ఆకర్షించిన తేనెకళ్ల సుందరి మోనాలిసా మరో ఎత్తు. దాదాపు పది రోజులుగా ఈ యువతి గురించి రోజూ వార్తలు వస్తూనే ఉన్నాయి. మేళాలో ఏదో ఓ మూల పూసలు అమ్ముకుంటున్న మోనాలిసాని ఓ వ్యక్తి వీడియో తీశాడు. అది సోషల్ మీడియాలో పెట్టాడు. ఇక సోషల్ మీడియా గురించి స్పెషల్‌గా చెప్పాలా..? ఎవరినైనా ఒక్క రోజులో స్టార్‌ని చేసేస్తుంది. అదిగో అలానే..ఈ మోనాలిసా కూడా క్రేజ్ సంపాదించుకుంది. ఆమె స్టార్ అయిపోయింది అనడానికి ఓ ఎగ్జాంపుల్ ఏంటంటే..బాలీవుడ్‌లో ఓ మూవీలో నటించే ఛాన్స్ కూడా కొట్టేసింది. నిజ జీవితానికి దగ్గరగా ఉండే ఓ క్యారెక్టర్‌లో నటించనుంది. ఇలా ఫేమస్ అయ్యాక ఆమె ఏం చేసినా మీడియాలో, సోషల్ మీడియాలో హైలైట్ అవుతోంది. లోకల్ మేకప్ ఆర్టిస్ట్‌తో కొత్త లుక్‌లోకి మారిపోయిన ఈ వైరల్ గర్ల్..స్పెషల్ ఫొటో షూట్ చేసింది. ఈ ఫొటోలు తెగ వైరల్ అయ్యాయి. మరి ఇంత మంది మీ అందం చూసి ఫిదా అవుతుంటే.. మీకేమనిపిస్తోందని ప్రశ్నిస్తే..సిగ్గుతో నవ్వుతోంది మోనాలిసా. అయితే..ఇప్పుడు ఈ అందాల సుందరి గురించి ఓ వార్త సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది. వైరల్ అయినప్పటి నుంచి కేవలం 10 రోజుల్లో మోనాలిసా ఆదాయం భారీగా పెరిగిందని, రకరకాల ఆఫర్లు వస్తున్నాయని ప్రచారం మొదలైంది. ఎక్కడ చూసినా ఇదే డిస్కషన్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ట్రంప్ ఇచ్చిన షాక్‌తో..ఇండియన్స్ విలవిల.. ఇకపై ఉద్యోగాలు బంద్..!
కుంభమేళాలో తొక్కిసలాట.. ఎంతమంది చనిపోయారంటే
రూల్స్ మారాయి.. వైట్‌హౌస్‌లోకి ‘న్యూ మీడియా’ఎంట్రీ