రూల్స్ మారాయి.. వైట్‌హౌస్‌లోకి ‘న్యూ మీడియా’ఎంట్రీ
ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా అధికారం చేపట్టినప్పటినుంచి పాలనలో తనదైనశైలిలో దూసుకెళ్తున్నారు. ఇటీవలే అమెరికా పౌరులకు ఇన్ కం ట్యాక్స్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన ట్రంప్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైట్‌హౌస్‌లోకి సంప్రదాయేతర మీడియాకు చోటు కల్పించారు. ఆయన సందేశాలు అమెరికన్లకు మరింత చేరువయ్యేలా చూసుకుంటున్నారు.
అందులోభాగంగా వైట్‌హౌస్ లో సంప్రదాయ మీడియాతో పాటు ఇన్‌ఫ్లుయెన్సర్లకు, పాడ్‌కాస్టర్లకు, కంటెంట్ క్రియేటర్లకు చోటు కల్పించారు. మీడియా కార్యదర్శి కరోలీన్ లీవిట్ ఈ విషయాన్ని మంగళవారం మీడియాకు వెల్లడించారు. ‘లక్షల మంది అమెరికన్లు ముఖ్యంగా యువత సంప్రదాయేతర మీడియాపై ఎక్కువగా ఆకర్షితులవుతోంది. అందుకే.. స్వతంత్ర పాత్రికేయులు, పాడ్‌కాస్టర్లు, సోషల్ మీడియా ఇన్‌ప్లుయెన్సర్‌లు, కంటెంట్ క్రియేటర్లకు వైట్‌హౌస్‌లో అవకాశం కల్పిస్తున్నాం. ఇది అధ్యక్షుడు ట్రంప్ సందేశాలు వీలైనంత ఎక్కువమందికి చేరేలా చేస్తుంది. అది మా బృంద కర్తవ్యం కూడా’ అని లీవిట్ తెలిపారు. ఈ సందర్భంగా.. సంప్రదాయంగా బ్రీఫింగ్ రూమ్‌లో ప్రెస్ సెక్రటరీ సిబ్బందికి రిజర్వ్ చేసిన మొదటి ముందు వరుస సీటును ‘న్యూ మీడియా సీటు’గా మారుస్తున్నట్లు ఆమె వెల్లడించారు. అంతేకాక.. యాక్సియోస్, బ్రెయిట్‌బార్ట్ వంటి అవుట్‌లెట్‌లకు రోజూ శాశ్వత సీటు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మునుపటి పరిపాలనలో రద్దైన 400 మంది జర్నలిస్టుల ప్రెస్ పాస్‌లను తిరిగి పునరుద్ధరిస్తామన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నుమాయిష్‌లో సీక్రెట్‌గా షాపింగ్ స్టార్ నటి క్రేజీ థింగ్
కుంభమేళాలో ప్రకాష్‌రాజ్ పుణ్యస్నానం! మోనార్క్ రియాక్షన్