ట్రంప్ ఇచ్చిన షాక్‌తో..ఇండియన్స్ విలవిల.. ఇకపై ఉద్యోగాలు బంద్..!
ఈ ట్రంప్ రావడం ఏమో కానీ..వచ్చినప్పటి నుంచి ఇండియన్స్‌కి బీపీ పెంచేస్తున్నారు. ఏం కాదులే అని ధైర్యం చెప్పుకునే లోగా ఏదో భయం వెంటాడుతోంది. యూఎస్‌లో సెటిల్ అవ్వాలనుకునే వాళ్ల నుంచి స్టూడెంట్, వర్కింగ్ వీసాలపై అక్కడికి వెళ్లిన వాళ్ల వరకూ..అందరిలోనూ ఇదే టెన్షన్. ఎప్పుడు ఏం జరుగుతుందో..? ఇండియాకి తిరిగి వెళ్లిపోక తప్పదేమో అని ఆందోళన పడుతున్నారు.
ముఖ్యంగా భారతీయ విద్యార్థుల్లో ఈ బెంగ రోజురోజుకీ పెరిగిపోతోంది. వర్కింగ్ వీసాతో వచ్చిన వాళ్లంటే..కంపెనీ సపోర్ట్ ఉంటుంది. కానీ…లక్షల రూపాయల లోన్స్ తీసుకుని, ఎన్నో కలలు కంటూ అమెరికాకి వెళ్లిన విద్యార్థుల పరిస్థితే ఎటూ తోచకుండా అయిపోయింది. ఇమిగ్రేషన్ పాలసీపై ఇప్పటికే ఓ ట్రైలర్ చూపించిన ట్రంప్..ఇకపై సినిమా చూపించేందుకు సిద్ధమవుతున్నారు. అప్పటి నుంచి భారతీయ విద్యార్థులు గుబులు పెరిగిపోయి..అప్పటికప్పుడు ఓ నిర్ణయానికి వచ్చేస్తున్నారు. అక్కడి వర్సిటీల్లో చదువుకుంటూనే…చాలా మంది పార్ట్‌టైమ్ జాబ్‌లు చేసుకుంటూ ఉంటారు. ఇకపై ఈ పార్ట్‌టైమ్ ఉద్యోగాలు బంద్ చేయాలని డిసైడ్ అవుతున్నారు. ఇలా పార్ట్‌టైమ్ జాబ్‌లు చేసుకుంటే అమెరికాలో ఉండనిస్తారో లేదో…? వెంటనే వెళ్లిపోమంటారేమో..అన్న అనుమానాలతో ఇలా ఉద్యోగాలు వదులుకుంటున్నారు. అమెరికాలో చదువుకోవడం అంటే అంత ఆషామాషీ కాదు. అందుకోసం చాలా ప్రాసెస్ ఉంటుంది. బ్యాంక్ బ్యాలెన్స్ చూపించాలి. ఆర్థికంగా కాస్త ఫిట్‌గానే ఉన్నామన్న నమ్మకం కలిగించాలి. ఆ తరవాత వీసా ఇంటర్వ్యూ. ఇదంతా ఓకే అయ్యి F1 వీసా వస్తే..అప్పుడు డాలర్ డ్రీమ్స్ నెరవేరతాయి. ఇదంతా జరగాలి అంటే..ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అప్పు చేయాలి. బ్యాంక్ నుంచి ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కుంభమేళాలో తొక్కిసలాట.. ఎంతమంది చనిపోయారంటే
రూల్స్ మారాయి.. వైట్‌హౌస్‌లోకి ‘న్యూ మీడియా’ఎంట్రీ