కుంభమేళాలో తొక్కిసలాట.. ఎంతమంది చనిపోయారంటే
ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో అపశ్రుతి చోటుచేసుకుంది. బుధవారం మౌని అమావాస్య కావడంతో భక్తులు పోటెత్తారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. బుధవారం వేకువఝామున అమృత స్నానం కోసం భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఒక్కసారిగా తోసుకోవడంతో కిందపడి కొందరు భక్తులు మృతిచెందినట్టు తెలుస్తోంది.
పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్‌ల్లో ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మౌని అమావాస్యను పురస్కరించుకుని పుణ్యస్నానాలు ఆచరించేందుకు నిన్న రాత్రి నుంచే ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల తాకిడి విపరీతంగా ఉండటం వల్ల బారికేడ్లు విరగడంతో తొక్కిసలాట జరిగింది. సెక్టార్ 2 ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో సుమారు 20 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. అయితే, మరణాల సంఖ్యపై యూపీ సర్కారు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అమృతస్నానం కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు అఖాడాలు ప్రకటించారు. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఘటనపై ఆరా తీశారు. మరోవైపు, సీఎం యోగి భక్తులకు విజ్ఞప్తి చేశారు. ‘‘త్రివేణి సంగమం ప్రధాన కేంద్రం వద్దకు రాకుండా సమీపంలోని ఘాట్ల వద్ద పుణ్యస్నానాలు ఆచరించండి. ఆదేశాలు, సూచనలను పాటిస్తూ అధికారులకు సహకరించండి. ఎలాంటి వదంతులను నమ్మొద్దు’’ అని యూపీ సీఎంఓ ప్రకటన విడుదల చేసింది. తాజా పరిస్థితులపై యోగి ఆదిత్యనాథ్ మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రూల్స్ మారాయి.. వైట్‌హౌస్‌లోకి ‘న్యూ మీడియా’ఎంట్రీ
నుమాయిష్‌లో సీక్రెట్‌గా షాపింగ్ స్టార్ నటి క్రేజీ థింగ్