ఆస్ట్రియాలో అంగరంగ వైభంగా సంక్రాంతి సంబరాలు!
ఆస్ట్రియా దేశ రాజధాని వియన్నా పట్టణంలో అంగరంగ వైభవంగా సంక్రాంతి వేడుకలు జరిగాయి. ఆస్ట్రియా తెలుగు సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి పండగను ఘనంగా జరుపుకున్నారు. తెలుగు సాంప్రదాయాన్ని మరవకుండా పిండి వంటలతో, ముగ్గుల పోటీలతో తెలుగుదనం ఉట్టిపడేలా పండగను సెలబ్రేట్ చేసుకున్నారు.
ఇందులో భాగంగా మహిళలు వేసిన రంగురంగుల ముగ్గులు ఆకట్టుకున్నాయి. సొంత దేశంలో సొంతూళ్లలో పండగను ఎలా జరుపుకునేవారో వారి అనుభవాన్ని పంచుకుంటూ ఆనందంగా జరుపుకున్నారు. ఆస్ట్రియాలో ఉన్నామా.. ఆంధ్రాలో ఉన్నామా అన్నంత రీతిలో పంగను సెలబ్రేట్ చేసుకున్నామని, ఇలాంటి కార్యక్రమాలు ముందువరసలో ఉండి వైభవంగా నిర్వహించినందుకు ఆస్ట్రియా తెలుగు సంఘం బృందానికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం తెలుగు సంస్కృతి సాంప్రదాయ విలువలు చిన్నారులకు తెలిసేలా బుర్ర కథ రూపంలో సంక్రాంతి పండగ ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేశారు.
Follow Us
వైరల్ వీడియోలు
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

