కుప్పకూలి.. పేలిన ఎఫ్-35 యుద్ధ విమానం వీడియో
అగ్రరాజ్యం అమెరికాకు చెందిన ఎఫ్-35 యుద్ధ విమానం ఆకాశంలో నుంచి ఒక్కసారిగా కిందకు జారి పడింది. నేరుగా వచ్చి రన్‌వేపై పడిన ఈ విమానం.. క్షణాల్లోనే బూడిద అయింది. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించగా.. విమానం మొత్తం కాలిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అమెరికా అమ్ములపొదిలో ఉన్న ఎఫ్-35 యుద్ధ విమానాన్ని పూర్తిగా స్టెల్త్ పరిజ్ఞానంతో రూపొందించారు. ఈ యుద్ధ విమానం ఎంతో గుట్టుగా ప్రయాణిస్తుంది. ఈ విమానం ఏదైనా ఒక దేశం మీదుగా వెళితే, ఆ సంగతిని ఆ దేశ రాడార్లు కూడా గుర్తించలేవు. సరిగ్గా చెప్పాలంటే ఈ యుద్ధ విమానాన్ని ఫ్లయింగ్ కంప్యూటర్ అంటారు.
ఈ విమానం సేకరించిన డేటాను ఇతర ఆయుధ వ్యవస్థలతో పంచుకుని, అత్యంత కచ్చితత్వంతో దాడి చేయగలదు. అందుకోసం ప్రత్యేకంగా లింకింగ్ నెట్వర్క్ సెన్సర్లను ఇందులో ఏర్పాటు చేశారు.తాజాగా అమెరికాకు చెందిన ఎఫ్-35 యుద్ధ విమానం.. అలస్కాలోని ఎలిసన్ ఎయిర్ ఫోర్స్ బేస్ వద్ద ఆకాశంలో విన్యాసాలు చేస్తోంది. అయితే మంగళవారం రోజు మధ్యాహ్నం 1 గంటలకు ఈ విమానం ఉన్నట్టుండి కింద పడిపోయింది. విమానాశ్రయ రన్‌వే పై పడగా.. ఒక్కసారిగా పేలిపోయింది. విమానం భూమ్మీద పడ్డ వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇలా చూస్తుండగానే యుద్ధ విమానం బూడిదగా మారింది. అయితే అందులో ఉన్న పైలెట్ మాత్రం కింద పడ్డ వెంటనే పక్కకు వచ్చేశాడు. కానీ అప్పటికే అతడికి గాయాలు అయ్యాయి. ఈ విషయం గుర్తించిన స్థానిక అధికారులు వెంటనే పైలెట్‌ను బాసెట్ ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఎయిర్ బేస్ పరిధిలోనే ఈ ప్రమాదం జరగడంతో.. అధికారులు వెంటనే స్పందించగలిరారు.
మూడు గుడ్లకు రూ.500! బిల్లు చూసి షాకైన గెస్ట్, వైరల్ వీడియో
నిజాయితీ గెలిచిన ఆటో డ్రైవర్!
భార్యాపిల్లలు ఇంట్లో ఉండగానే.. ఇంటిని కూల్చేసిన భర్త
ఐఫోన్ కావాలన్న ప్రియురాలు.. మైనర్ ఏం చోరీ చేసాడంటే..
ఎవరెస్ట్‌పై అద్భుతం..ఆరు రోజులు ఆహారం, ఆక్సిజన్ లేకున్నా బతికాడు!
బాస్ అంటే ఇతడే.. కంటతడి పెట్టిస్తున్న ఘటన!
పేపర్ చదివేలోపు.. స్కూటీ కొట్టేసిన దొంగ

